Marriages: నిత్య పెళ్లికొడుకు.. ఏడు రాష్ట్రాలు.. 14 పెళ్లిళ్లు.. చివరకు ఏమైందంటే..?

|

Feb 15, 2022 | 3:53 PM

Man Who Married 14 Women In 7 States: అతని పని పెళ్లిళ్లు చేసుకోవడమే.. అలా ప్రాంతాలు మారుస్తూ ఇప్పటివరకు.. 7 రాష్ట్రాల్లో 14 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అలా ఒకరికి తెలియకుండా మరొకరిని

Marriages: నిత్య పెళ్లికొడుకు.. ఏడు రాష్ట్రాలు.. 14 పెళ్లిళ్లు.. చివరకు ఏమైందంటే..?
Follow us on

Man Who Married 14 Women In 7 States: అతని పని పెళ్లిళ్లు చేసుకోవడమే.. అలా ప్రాంతాలు మారుస్తూ ఇప్పటివరకు.. 7 రాష్ట్రాల్లో 14 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అలా ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహమాడుతున్న నిత్య పెళ్లికొడుకును (48) ఒడిశాలోని (Odisha) భువనేశ్వర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని కేంద్రపర (kendrapara) జిల్లా పత్కుర పోలీస్ స్టేషర్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రమేష్ స్వైన్ ఇప్పటివరకు 14 మందిని వివాహమాడినట్టు భువనేశ్వర్ డీసీపీ ఉమేష్ కుమార్ దాస్ వెల్లడించారు. తాజాగా.. మోసపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు బిదు ప్రకాష్ అలియాస్ రమేష్ స్వైన్‌ను అరెస్టు చేసినట్లు దాస్ వెల్లడించారు.

రమేష్ స్వైన్.. 1982లో  మొదటి వివాహం చేసుకున్నాడని.. ఆ తర్వాత 2002లో రెండోసారి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఇద్దరు భార్యలకు కలిపి ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడన్నారు. అయితే.. మ్యాట్రిమోనీ వెబ్సై‌‌ట్లలో ప్రొఫైల్ పెట్టి సంబంధం వెతుక్కునేవాడు. ఈ విషయం భార్యలకు తెలియకుండా జాగ్రత్త పడేవాడని తెలిపారు. ఇలా 14 మంది మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. చివరి భార్య ఢిల్లీలో స్కూల్ టీచర్.. ఆమెకు తన భర్త పూర్వపు వివాహాల గురించి తెలిసింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. నిందితుడికి ఢిల్లీ, పంజాబ్, అసోమ్, ఝార్ఖండ్, ఒడిశా సహా ఏడు రాష్ట్రాల్లో భార్యలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

విడాకులు తీసుకుని, ఒంటరి జీవితం గడుపుతున్న మహిళల కోసం మాట్రిమోనీ సైట్లలో వెతికేవాడని.. తానొక డాక్టర్‌నని అబద్ధమాడుతూ వాళ్లను బుట్టలో వేసుకునేవాడని  పోలీసులు తెలిపారు. అలా తన వలలో పడిన వారి నుంచి డబ్బు తీసుకుని ఉడాయించేవాడని పేర్కొన్నారు. ఈ నిందితుడి ఉచ్చులో కేంద్ర పారా మిలటరీ దళంలో పనిచేసే ఒక మహిళ కూడా ఉండడం గమనార్హం.

Also Read: Flipkart: మీ పాత ఫోన్‌ను అమ్మేయాలనుకుంటున్నారా.? ఫ్లిక్‌కార్ట్‌తో మీ పని మరింత ఈజీ..

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌‌పై కేసు నమోదు చేయనున్న అస్సాం పోలీసులు.. మరింత ముదురుతున్న వివాదం..