సరదాగా సినిమా చూడటానికి వచ్చిన ఓ వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్న ఇద్దరు యువకుల మధ్య నెలకొన్న గొడవ.. ప్రాణాలు తీసుకునేంతవరకు వెళ్లింది. సీటు విషయంలో మొదలైన వివాదం.. చిలికి చిలికి గాలివానలా మారి తుపాకీతో కాల్చుకునేవరకు వచ్చింది. హవేరీ జిల్లాలో కేజీఎఫ్ 2 సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లో మంగళవారం రాత్రి ఘటన జరిగింది. కర్ణాటకలోని హవేరి జిల్లా షిగ్గాన్‌లోని ఓ థియేటర్లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ 2 సినిమా ప్రదర్శితమవుతుంది. ఈ మూవీని చూసేందుకు మంగళవారం ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి వచ్చాడు.. సినిమా చూస్తున్న సమయంలో ఆ యువకుడు తన ముందు సీటుపై కాలుపెట్టగా.. ఆ సీటులో కూర్చొన్న వ్యక్తి సీరయస్ అయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి పెద్ద గొడవే జరిగింది. దీంతో అసహనానికి గురైన ముందు సీటు వ్యక్తి బయటకు వెళ్లిఓ తుపాకీతో తిరిగి వచ్చాడు. అనంతరం తన సీటుపై కాలుపెట్టిన వ్యక్తిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు.
ఒక్కసారిగా థియేటర్లో కాల్పులు జరగడంతో ప్రేక్షకులు ఉలిక్కిపడ్డారు. దీంతో నిందితుడు వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే గాయపడిన వ్యక్తిని స్థానికులు హుబ్బళ్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం గాయపడిన యువకుడికి చికిత్స జరుగుతుందని.. బుల్లెట్లు అతని పొత్తి కడుపులోకి దూసుకెళ్లాయని.. ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: Mahesh Babu: మిమ్మల్ని ప్రేమించడానికి ఒక్కరోజు సరిపోదు.. అమ్మకు ప్రేమతో..
KGF Chapter 2: మనసులోని మాట బయటపెట్టిన రాకీభాయ్.. ఆ హీరోయిన్‌తో నటించాలని ఉందంటూ..
KGF Chapter 2: బాక్సాఫీస్ దగ్గర రాకీభాయ్ హవా.. కొనసాగుతున్న వసూళ్ల వేట..