5వ భార్య భర్తకు మొదట ఫోర్న్ వీడియోలు చూపించింది.. ఆ తర్వాత కాళ్లు, చేతులు కుర్చీకి కట్టింది.. చివరికి…

|

Mar 12, 2021 | 4:09 PM

మూడు రోజుల క్రితం నాగ్‌పూర్‌లోని గణేష్‌పేత్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలోని ఓ కాంప్లెక్స్‌లో ఒక వ్యక్తి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ కేసుపై సత్వర దర్యాప్తు జరిపిన పోలీసులు...

5వ భార్య భర్తకు మొదట ఫోర్న్ వీడియోలు చూపించింది.. ఆ తర్వాత కాళ్లు, చేతులు కుర్చీకి కట్టింది.. చివరికి...
భర్తను హత్య చేసిన 5వ భార్య
Follow us on

మూడు రోజుల క్రితం నాగ్‌పూర్‌లోని గణేష్‌పేత్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలోని ఓ కాంప్లెక్స్‌లో ఒక వ్యక్తి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ కేసుపై సత్వర దర్యాప్తు జరిపిన పోలీసులు దిగ్భ్రాంతికరమైన వెల్లడించారు. పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం     లక్ష్మణ్ మాలిక్ అనే వ్యక్తి తన ఐదవ భార్య స్వాతి చేత కిరాతకంగా చంపబడ్డాడు. ఈ కేసులో భార్యను పోలీసులు అరెస్టు చేశారు.

అసలు ఏం జరిగింది?

మరణించిన లక్ష్మణ్ మాలిక్ రజత్  గత కొన్ని రోజులుగా సంకుల్ లోని ఒక ఫ్లాట్ లో ఒంటరిగా నివసిస్తున్నాడు. మార్చి 8 సాయంత్రం, అతని ఐదవ భార్య స్వాతి అతనిని కలవడానికి ఫ్లాట్‌కు వెళ్ళింది. ఈ క్రమంలో అతడితో సన్నిహితంగా మెలిగిన స్వాతి పోర్న్ వీడియోలను చూపిస్తూ అతడి చేతులు, కాళ్లు కుర్చీకి కట్టింది. ఆ తర్వాత ఆమె తనతో తెచ్చిన పదునైన కత్తితో గొంతు కోసి లక్ష్మణ్ మాలిక్ కొంతుకోసింది. అతడు చనిపోయాడని నిర్థారించుకున్నాక స్వాతి అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యింది.

మరుసటి రోజు, మార్చి 9 న, లక్ష్మణ్ మాలిక్ హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులకు విచారణలో అనేక షాకింగ్ విషయాలు తెలిశాయి. మృతుడికి పలువురు మహిళలతో సంబంధాలున్నాయని వారు వెల్లడించారు. మాలిక్ ఐదుగురు మహిళలను వివాహం చేసుకున్నట్లు కూడా పోలీసులకు తెలిసింది.

పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన స్వాతి..

కేసు విచారణలో భాగంగా పోలీసులు అతడితో సంబంధం ఉన్న ప్రతి మహిళను విచారించారు. ఈ క్రమంలో మృతుడి ఐదవ భార్య స్వాతి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఆమె వ్యవహారశైలిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. దీంతో లక్ష్మణ్ మాలిక్ ను తానే చంపినట్లు ఆమె అంగీకరించింది.

పెన్షన్ డబ్బుపై ఇద్దరి మధ్య వివాదం..

లక్ష్మణ్ మాలిక్ ఐదవ భార్య స్వాతికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. కాగా, స్వాతి ఇప్పుడు మరో మూడు నెలల శిశువు పెంచుకుంటూ ఉండటంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఆ శిశువును దత్తత తీసుకున్నట్లు ఆమె చెబుతోంది. కాగా స్వాతికి  మరో పురుషుడితో సంబంధం ఉందని మృతుడు అనుమానించాడు. అంతేకాకుండా, మృతుడు పదవీ విరమణ చేసినందున, అతని పెన్షన్ డబ్బుపై ఇద్దరి మధ్య వివాదం నడుస్తుంది. ఈ క్రమంలోనే లక్ష్మణ్ మాలిక్‌ను హత్య చేసినట్లు పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ వెల్లడించారు. ఈ సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

Also Read:

Gummadi Narsaiah Biopic: 5 సార్లు ఎమ్మెల్యే.. అత్యంత సాధారణ జీవితం.. త్వరలో ఆయన బయోపిక్ !