Hyderabad: చూస్తుండగానే నాలాలో పడిపోయాడు.. అదే రోజు ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి.. ఇంకా దొరకని ఆచూకీ

|

Sep 30, 2021 | 11:16 AM

హైదరాబాద్‎లోని మణికొండలో నాలాలో పడి గల్లంతైన రజినీకాంత్‌ సాఫ్ట్ వేరు ఇంజినీర్ గల్లంతయ్యారు.. అదే రోజు మరో వ్యక్తి గల్లంతయ్యారు...

Hyderabad: చూస్తుండగానే నాలాలో పడిపోయాడు.. అదే రోజు ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి.. ఇంకా దొరకని ఆచూకీ
Man Fal
Follow us on

హైదరాబాద్‎లోని మణికొండలో నాలాలో పడి గల్లంతైన రజినీకాంత్‌ సాఫ్ట్ వేరు ఇంజినీర్ గల్లంతయ్యారు. అతని మృతదేహం నెక్నాంపూర్‌ చెరువులో లభ్యమైంది.  ఈనెల 25న మణికొండ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది.  రజినీకాంత్‌ మణికొండ గోల్డెన్‌ టెంపుల్‌ ముందు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నీటిలో ఆ గుంత కనిపించక అందులో పడిపోయాడు. అతడి కోసం గాలింపు చేపట్టిన డీఆర్ఎఫ్ బృందాలు 27న నెక్నాంపూర్‌ చెరువులో రజినీకాంత్ మృతదేహాన్ని కనుగొన్నాయి. కానీ అదే రోజు మరో వ్యక్తి నాలా పడి గల్లంతైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్‎​లో ఓ వ్యక్తి నాలాలో గల్లంతయ్యాడు. మణికొండ ఘటనలో మూడు రోజులకు బాధితుని మృతదేహం లభ్యమైంది. కుత్బుల్లాపూర్​లో గల్లంతైన వ్యక్తి ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభ్యం కాలేదు. కుత్బుల్లాపూర్ గణేశ్​ టవర్స్‎​లో నివాసముండే మోహన్​రెడ్డి ఈనెల 25న.. రాయల్ వైన్స్ వద్ద స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఇంటికి బయలుదేరే సమయంలో భారీ వర్షం కురవటంతో స్నేహితులు ఇద్దరు పక్కకు ఆగారు. మోహన్​రెడ్డి మాత్రం సిగరెట్ తాగుతూ నాలా పక్కన నిలబడ్డాడు. చూస్తూండగానే.. నాలాలో పడిపోయాడు. గమనించిన స్నేహితులు మోహన్​రెడ్డిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల మోహన్​రెడ్డి కొట్టుకుపోయాడు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇటు మోహన్​రెడ్డి కుటుంబ సభ్యులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు.. రెస్క్యూ బృందాలను పంపించి గాలింపు చర్యలు చేపట్టారు. చూస్తుండగానే… మోహన్​రెడ్డి ఒక్కసారిగా నాలాలో పడిపోయిన దృశ్యాలు సీసీకెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియో ఇప్పడు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి.

Read Also.. IPL Betting: యాప్‌లతో వేల రూపాయల పందేలు కాస్తారు.. బాప్ రే అనిపించేంతగా లక్షలు కొల్లగొడ్తారు.!