గుండ్లకమ్మ జలాశయం దగ్గర దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో పాటు పిల్లలు లేరనే కారణంతో భార్యను జలాశయంలోకి తోసేశాడు భర్త. విహారయాత్రకు వెళదామని చెప్పి ప్లాన్‌గా గుండ్లకమ్మ దగ్గరకు తీసుకెళ్లి జలాశయంలోకి తోసేశాడు భర్త పాపారావు. కూతురు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అసలు విషయం బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం రెడ్డిపాలేనికి చెందిన ఉప్ప ఆదిలక్ష్మిని మూడేళ్ల కిందట ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన పాపారావుకు ఇచ్చి వివాహం చేశారు. కొంత కాలం నుంచి ఇరువురి మధ్య విభేదాలు తలెత్తడంతో ఆదిలక్ష్మి రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. భర్త బాగా చూసుకుంటానని హామీ ఇవ్వడంతో వారం రోజుల క్రితం మళ్లీ అతనితో వెళ్లింది. వెళ్లిన మూడు రోజుల తరువాత ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు అద్దంకి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భార్యపై అనుమానం, పిల్లలు లేరన్న కారణంగా ఆమెను అంతమొందించి మరో పెళ్ళి చేసుకోవాలని పాపారావు వేసిన మాస్టర్ స్కెచ్‌కు ఆదిలక్షి బలైందని గుర్తించారు. విహారయాత్ర పేరుతో నమ్మకంగా తీసుకెళ్ళి గుండ్లకమ్మ నదిలో తోసి భర్త పాపారావే చంపాడని పోలీసులు నిర్ధారించారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read: లేగదూడ విషయంలో తలెత్తిన గొడవ.. పొట్టు.. పొట్టు కొట్టుకున్నారు..
నేడు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి