Man Arrest: యువతులను లైంగికంగా వేధించిన ఇంజనీర్‌ను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. మ్యాట్రిమోనియల్ సైట్‌లను ఉపయోగించి పెళ్లి పేరిట యువతులను ఆకర్షించాడు. అనంతరం వారిని లైంగికంగా వేధించాడు. ఆ మెకానికల్ ఇంజినీర్‌ను మహారాష్ట్ర ముంబై పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 12 మంది యువతులను లైంగికంగా వేధించాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు మహేష్ అలియాస్ కరణ్ గుప్తాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ముంబైలోని మలాడ్ ప్రాంతానికి చెందిన మహేష్ ఉన్నత విద్యావంతులైన యువతులను ఆకర్షించేందుకు మ్యాట్రిమోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్ లను ఏర్పరుచుకున్నాడు. మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా యువతులతో సన్నిహితంగా మెలుగుతూ వారిని ఫోన్లలో సంప్రదించి పబ్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌కు తీసుకెళ్లేవాడు.
ఈ క్రమంలో ఆ యువతులను లైంగికంగా వేధించాడని డిప్యూటీ పోలీసు కమిషనర్ సురేష్ మెన్ గేడ్ వెల్లడించారు. ప్రతీ నేరానికి ఓ కొత్త మొబైల్ నంబరును ఉపయోగించాడని పేర్కొన్నారు. ప్రతీసారి తన సిమ్ ను మార్చుకుంటూ ఓలా లేదా ఉబెర్ ఉపయోగించి క్యాబ్రైడ్లను బుక్ చేసేవాడని పేర్కొన్నరాు. గతంలో హ్యాకర్ గా పనిచేసిన మహేష్ కంప్యూటర్లపై మంచి పరిజ్ఞానం ఉంది. పెద్ద కంపెనీల్లో పనిచేసిన మహేష్ 12 మంది మహిళలను లైంగికంగా వేధించాడని పేర్కొన్నారు. కొంతమంది మహిళలు ఇచ్చిన ఫిర్యాదుతో.. నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు డీసీపీ వెల్లడించారు.
Also Read: