Crime News: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తుపాకీ కలకలం.. దర్జాగా విమానంలో తీసుకొచ్చి..
Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తుపాకీ కలకలం సృష్టించింది. గురువారం ఉదయం దుబాయ్ నుంచి ఢిల్లీ
Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తుపాకీ కలకలం సృష్టించింది. గురువారం ఉదయం దుబాయ్ నుంచి ఢిల్లీ (IGI Airport) కి వచ్చిన విమానంలో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు పిస్టల్, రెండు ఖాళీ మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి అనుమానాస్పద కదలికలను గుర్తించి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రయాణికుడి దగ్గర పిస్టల్ (Gun) ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. బ్యాగ్‌లో పిస్టల్ ఎలా తీసుకొచ్చాడు.. దేనికోసం తీసుకెళ్తున్నాడు అన్న కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
పిస్టల్‌తో ఉన్న బ్యాగ్‌ను విమానం లోపలికి ఎలా అనుమతించారని.. ఎయిర్‌లైన్స్ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడిపై ఆర్మ్ యాక్ట్‌కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. 32 ఏళ్ల ప్రయాణికుడు మొదట జెద్దా నుంచి దుబాయ్‌కి ప్రయాణం ప్రారంభించాడని, ఆపై మరొక విమానంలో న్యూఢిల్లీకి వచ్చాడని అధికారి తెలిపారు.
అయితే.. ప్రయాణికుడి పేరును అధికారులు వెల్లడించలేదు. ఆ వ్యక్తిని దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అతని కోవిడ్ రిపోర్టు నెగెటివ్‌గా రావడంతో సంబంధిత కోర్టుకు తరలించారు. అనంతరం కోర్టు ఆదేశాలతో జ్యుడీషియల్ కస్టడీకి కస్టడీకి తరలించినట్లు అధికారులు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.
Also Read: