Crime news: ఆ ఇంట్లో నాలుగు మృతదేహాలు.. హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడా.. అసలు ఏం జరిగింది..

ఓ వ్యక్తి.. భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కేరళలోని కొల్లాంలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం కొట్టారకరలోని నీలేశ్వరంలోని ఓ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు శవాలుగా కనిపించారు...

Crime news: ఆ ఇంట్లో నాలుగు మృతదేహాలు.. హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడా.. అసలు ఏం జరిగింది..
Crime

Updated on: Nov 08, 2021 | 5:06 PM

ఓ వ్యక్తి.. భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కేరళలోని కొల్లాం జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం కొట్టారకరలోని నీలేశ్వరంలోని ఓ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు శవాలుగా కనిపించారు. మృతులు నీలేశ్వరానికి చెందిన రాజేంద్రన్ (55), అతని భార్య అనిత (50), పిల్లలు ఆదిత్య రాజ్ (24), అమృత (21)గా గుర్తించారు. రాజేంద్రన్ ఉరివేసుకుని మృతి చెందారు. అంతకుముందు భార్య, పిల్లలను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేంద్రన్ ఆటోరిక్షా డ్రైవర్ అని పోలీసు వర్గాలు తెలిపాయి. అమృత డిగ్రీ కోర్సు చేస్తుండగా ఆదిత్య రాజ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వారి కుటుంబం నీలేశ్వరంలోని సొంత ఇంట్లో నివసం ఉంటుంది.

రాజేంద్రన్ ఆత్మహత్యకు ముందే భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు రాజేంద్రన్ ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారినా ఇంటికి తాళం వేసి ఉండడంతో స్థానికులు వెళ్లి తలుపులు పగలగొట్టారు. ఇంటిలో రాజేంద్రన్ కుటుంబ సభ్యులు మృతి చెంది కనిపించారు. ఈ ఘటనపై మధ్యాహ్నం 12 గంటలకో కొట్టారకర పోలీసులు సమాచారం అందింది. కేసు నమోదు చేసుకున్న వారు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. ఆర్థిక సమస్యల కారణంగానే రాజేంద్రన్‌ ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read Also..  Crime News: మధ్యప్రదేశ్‎లో దారుణం.. టవల్ ఇవ్వలేదని భార్యను హత్య చేసిన భర్త..

Crime News: అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు.. పోలీసుల విచారణలో బయటపడిన అసలు నిజం..