Suicide: ‘నా భార్య వల్లే చనిపోతున్నా’.. ఉత్తరం రాసి ఉరేసుకున్న భర్త.. రొంపిచర్లలో విషాదం..

Man commits suicide: తన చావుకు భార్యే కారణమని లేఖ రాసి ఓ భర్త బలవన్మరణాకి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం గుంటూరు జిల్లాలోని

Suicide: ‘నా భార్య వల్లే చనిపోతున్నా’.. ఉత్తరం రాసి ఉరేసుకున్న భర్త.. రొంపిచర్లలో విషాదం..
Suicide

Updated on: Jun 09, 2021 | 10:01 AM

Man commits suicide: తన చావుకు భార్యే కారణమని లేఖ రాసి ఓ భర్త బలవన్మరణాకి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం గుంటూరు జిల్లాలోని రేపల్లె మండలం రొంపిచర్లలో చోటుచేసుకుంది. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం… రొంపిచర్లకు చెందిన ఏలికా రామకృష్ణారావు (32) కు ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన యువతితో కొంతకాలం క్రితం వివాహం జరిగింది. తరచూ ఈ దంపతుల మధ్య గొడవలు జరగడంతో భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో రామకృష్ణారావు భార్య… ఈపూరు స్టేషన్‌లో భర్త, అతని బంధువులపై కేసు పెట్టింది. సోమవారం రామకృష్ణారావు, అతని బంధువులను పోలీసులు ఈపూరు స్టేషన్‌కు పిలిపించి మాట్లాడి వివరాలు సేకరించారు.

అనంతరం రాత్రి రామకృష్ణారావు, బంధువులు ఇళ్లకు వెళ్లారు. ఈ క్రమంలో రామకృష్ణారావు తన చావుకి కారణం భార్య, వారి కుటుంబ సభ్యులని ఉత్తరం రాసి ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున అతను ఉరేసుకుని ఉండటాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కుమారుడి భార్య, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హజరత్తయ్య వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.