Krishna district Crime News: ఏపీలోని కృష్ణా జిల్లా ఎ.కొండూరులో విషాదం చోటుచేసుకుంది. కాపు సారా అమ్ముతున్నాడని ఓ గిరిజనుడిని ఎస్పై పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి కొట్టడంతో ఆ అవమానాన్ని భరించలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. దీంతో కుటుంబసభ్యులు, గిరిజనులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఎస్పైను సస్పెండ్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఎ.కొండూరు (A.Konduru ) లో గిరిజన తాండలలో అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీనిలో భాగంగా ఓ కానిస్టేబుల్ సోమవారం రాత్రి రేపూడి తండాకు చెందిన లకావత్ బాలాజి (62) ఇంట్లో దొరికిన సారా ప్యాకెట్లతో అతడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు.
స్టేషన్లో బాలాజీని ఎస్సై తీవ్రంగా కొట్టడంతో కిందపడిపోయాడని మృతుని కుమారుడు ఆరోపిస్తున్నాడు. తర్వాత మళ్లీ విచక్షణా రహితంగా కొట్టారని.. ఈ అవమానాన్ని భరించలేక మంగళవారం నారికింపాడు సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు. విషయం తెలిసి అంబులెన్స్ లో విస్సన్నపేటలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ మరణించాడు.
కాగా.. ఆస్పత్రిని నుంచి మృతదేహాన్ని తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు విస్సన్నపేట – ఏ.కొండూరు ప్రధాన రహదారిపై రేపూడి తండా వద్ద ఆందోళనకు దిగారు. మతదేహాన్ని అంబులెన్స్ లో ఉంచి రాస్తారోకో నిర్వహించారు. బాలాజీ మతికి కారణమైన ఎస్పై టి శ్రీనివాస్‌ను వెంటనే సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు.
-శివకుమార్, టీవీ9 తెలుగు
Also Read: