Andhra Pradesh: లెఫ్ట్‌లో ఒరిజినల్ ఫోటో.. రైట్‌లో మ్యాట్రిమోనిలో పెట్టిన ఫోటో.. కట్ చేస్తే అరకోటి స్వాహా

అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త...! కేటుగాళ్లు ముసుగులు తగిలించుకుని మిమ్మల్ని పలకరిస్తున్నారు. నమ్మారో.. నట్టేట ముంచేస్తారు.

Andhra Pradesh: లెఫ్ట్‌లో ఒరిజినల్ ఫోటో.. రైట్‌లో మ్యాట్రిమోనిలో పెట్టిన ఫోటో.. కట్ చేస్తే అరకోటి స్వాహా
Cheating
Follow us

|

Updated on: Sep 03, 2022 | 9:16 AM

AP Crime News: పెళ్లి పేరుతో మోసం. ఇది మామూలు మోసం కాదు. ఏకంగా ఫోటో మార్చేశాడు. పేరు చేంజ్‌ చేశాడు. మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో హైఫై డీటేల్స్‌ పెట్టి ఓ యువతిని నమ్మించి వంచించాడు. అతని ఒరిజినల్ ఫోటో, సైట్‌లో అప్‌లోడ్ చేసిన ఫోటోకు వ్యత్యాసం చూస్తే మీ మైండ్ అవుతుంది. మాంచి అందంగా ఉన్న వేరే వ్యక్తి ఫోటోను పెట్టి ఓ యువతిని నిండా ముంచేసిన ఈ వ్యక్తి పేరు పొట్లూరి వంశీకృష్ణ. కృష్ణా జిల్లా(Krishna District)కు చెందినవాడు. మ్యాట్రిమోని వెబ్‌సైట్లో మాత్రం శ్రీకాంత్‌గా ఫేక్ ఐడీ క్రియేట్ చేశాడు. అతని ఫోటో, డీటేల్స్‌ నమ్మి మోసపోయింది నర్సరావుపేటకు చెందిన ఓ యువతి. ఊరు, పేరు మార్చుకోవడమే కాదు.. తనకు ఫారిన్ వీసా రావాల్సి ఉందంటూ.. ఏకంగా 48 లక్షల 56 వేలు వసూలు చేశాడు. అతగాడి ప్రవర్తనలో తేడా కొట్టడంతో బాధితురాలు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేటుగాడి బాగోతం వెలుగుచూసింది.

గతంలొ ఏపీలోని రాజమండ్రికి చెందిన జోగడ వంశీకృష్ణ అనే వ్యక్తి కూడా సోషల్ మీడియాలో మాయమాటలు చెప్పి దాదాపు 1000 మంది అమ్మాయిలను ముంచేశాడు. వాళ్ల దగ్గర నుంచి భారీగా డబ్బు గుంజాడు.  పాపాలు పండి ప్రజంట్ జైల్లో చిప్పకూడు తింటున్నాడు. అప్రమత్తంగా ఉండాలని మేము పదే, పదే హెచ్చరిస్తున్నా కూడా అమ్మాయిలు ఇలాంటి పోకిరాల ట్రాప్‌లో పడటం ఆందోళన కలిగిస్తుంది.

మరిన్ని నేర వార్తల కోసం క్లిక్ చేయండి..