Chittoor District: నగిరిలో చిటీల వ్యాపారి జంప్.. కట్టినవారందరూ నేత కార్మికులే.. పాపం మనిషికో గోడు

|

Jul 31, 2021 | 7:21 AM

ప్రభుత్వాలు, పోలీసులు, మీడియా ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. మాయగాళ్లు అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెడుతూనే ఉన్నారు.

Chittoor District: నగిరిలో చిటీల వ్యాపారి జంప్.. కట్టినవారందరూ నేత కార్మికులే.. పాపం మనిషికో గోడు
Cheating
Follow us on

ప్రభుత్వాలు, పోలీసులు, మీడియా ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. మాయగాళ్లు అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెడుతూనే ఉన్నారు. దీంతో ఎన్నో ఆశలతో ఉన్న వారి జీవితాలు ఒక్కసారిగా నిషీధిలోకి వెళ్తున్నాయి. ఫలితంగా ఆ కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. అటు వారిని ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం నిజంగా బాధాకరం. తాజాగా చిత్తూరు జిల్లా నగిరిలో చిటీల వ్యాపారి పరారీ చాలామందిలో ఆందోళన పెంచింది. దాదాపు 10 కోట్ల రూపాయల దాకా చీటీలు నిర్వహిస్తున్న అరుణ్‌కుమార్ కనిపించకుండా పోయారు. దీంతో ఆయన దగ్గర చీటీలు కట్టినవారు లబోదిబోమంటున్నారు. లక్ష రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు చీటీలు నిర్వహించాడు అరుణ్‌కుమార్. ఈయన దగ్గర చిట్టీలు కట్టింది ఎక్కువ పేదవారే. బాధితులు చాలామంది ఏకాంబర కుప్పంకు చెందిన నేత కార్మికులే. చీటీల వ్యాపారి అరుణ్ కుమార్ మోసంపై వందలాది మంది పోలీసులకు పిర్యాదు చేశారు.

కొద్ది రోజులుగా కరోనా సాకు చూపి చీటీలు వేసిన వారికి డబ్బు చెల్లించకుండా దాటవేస్తూ వచ్చాడు అరుణ్ కుమార్. భార్య, పిల్లలను ఇంట్లో ఉంచి అరుణ్ కుమార్ వెళ్లిపోయారు. దీంతో బాధితులు నగిరి సీఐ మద్దయ్యచారికి ఫిర్యాదు చేశారు. 200 మందికి పైగానే భాదితులు ఉన్నారు. అరుణ్‌కుమార్‌ కనిపించపోయేసరికి ఆయన దగ్గర చీటీలు కట్టినవారు భయాందోళనలో ఉన్నారు. పిల్లల చదువుల కోసం అనుకొని డబ్బులు కట్టామని కొందరు పోలీసుల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇంకొందరు తమ కుమార్తెల వివాహం కోసం పనికొస్తాయని కట్టినట్టు చెబుతున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరుతున్నారు.

Also Read: ఏపీలో పదో తరగతి అర్హతతో ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి తేదీ

సారాయి పారబోతకు చెరువు తవ్వకం.. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన యదార్థం.!