Peddapalli: ఖానాపూర్‌లో యువతిపై దుండగుడి దాడి.. నోట్లో పురుగుల మందు పోసి పరారీ

|

Aug 09, 2021 | 7:06 PM

పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ లో ఒక యువతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. దాడి చేయడం మాత్రమే కాకుండా..

Peddapalli: ఖానాపూర్‌లో యువతిపై దుండగుడి దాడి.. నోట్లో పురుగుల మందు పోసి పరారీ
Attack On Women
Follow us on

పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ లో ఒక యువతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. దాడి చేయడం మాత్రమే కాకుండా.. నోట్లో పురుగుల మందు కూడా పోశాడు. ప్రస్తుతం యువతి ప్రాణాపాయ స్థితిలో ఉంది. మొదట మంథని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాధమిక చికిత్సనందించగా.. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ కు తరలించారు. ఈ ఘటనపై విచారణకు దిగిన పోలీసులు నిందితుడెవరో గుర్తించారు. సతీష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు అధికారులు. బాధిత యువతి తండ్రి ఓదేలు.. ఫిర్యాదు ఇవ్వడంతో.. పోలీసులు సతీష్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. తన కూతురుపై సతీష్ దాడి చేయడం గుర్తించిన ఓదేలు.. అతడిని కర్రతో కొట్టాడనీ.. అయినా సరే అతడు తప్పించుకుని పారిపోయాడని తమ విచారణలో తేలిందని అంటున్నారు పోలీసులు. ప్రస్తుతం ఓదేలు కూతురు కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

కామారెడ్డిలో యువకుల వీరంగం

మద్యం మత్తులో ఐదుగురు యువకులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ బార్​లో వీరంగం సృష్టించారు. మద్యం డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు బార్ మేనేజర్​పై దాడి చేశారు. అడ్డుకోబోయిన స్టాఫ్‌ని కొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి కొత్త బస్టాండ్ పక్కనే ఉన్న ఓ బార్​కు రాత్రి ఐదుగురు యువకులు వెళ్లారు. ఫుల్‌గా మద్యం సేవించిన అనంతరం వారిలో వారు గొడవ పెట్టుకొని ఘర్షణకు దిగారు. గొడవ ఆపేందుకు బార్ సిబ్బంది వెళ్లగా వారిపై కూడా దాడి చేశారు. మద్యం బిల్లు కట్టమని అడగడంతో మరోసారి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో బార్ మేనేజర్ రాజేశ్వర్రావు తలకు తీవ్ర గాయమైంది. ఈ మేరకు సిటీ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. పెళ్లిళ్లు, సభలు, సమావేశాలకు లిమిట్… అతిక్రమిస్తే

 ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన విద్యాశాఖ మంత్రి.. స్కూల్స్ పున: ప్రారంభంపై కూడా క్లారిటీ