Making Gold Biscuits: నకిలీకి కాదేదీ అనర్హం అన్నట్లు అన్నట్లు.. మరో దొంగ ముఠా గుట్టురట్టైంది. జనంలో ఉన్న క్రేజీని సొమ్ము చేసుకునేందుకు యత్నించిన వ్యాపారులను ప్రత్యేక పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చెన్నూరు పట్టణంలో నకిలీ బంగారు బిస్కెట్ల తయారీ కలకలం సృష్టించింది. సృష్టించింది. హాల్‌మార్క్ అచ్చులతో బిస్కెట్లు తయారు చేసి తక్కువ ధరకు పలువురు వ్యాపారులు అమ్ముతున్నారు. దీనిపై జిల్లా డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం పాటించకుండా అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్వర్ణకార సంఘం నేతలు డిమాండ్ చేశారు.
దేశ వ్యాప్తంగా బంగారు నగల అమ్మకాలపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారు ఆభరణాలు, ఉత్పత్తులకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసింది. 2019 నవంబరులో హాల్ మార్క్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో తొలిసారిగా జనవరి 15 వరకు హాల్ మార్క్ అమలుకు జ్యువలరీ దుకాణాలకు కేంద్రం గడువు ఇచ్చింది. కరోనా వల్ల తమ వ్యాపారం దెబ్బతిన్నదని సమయం పొడిగించాలని కోరిన ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (ఎజిజెడిసి), ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ చేసిన అభ్యర్థనలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ముందుగా జూన్ 1 వరకు.. కరోనా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో తిరిగి జూన్ 15 వరకు గడువు పొడిగించారు. దీంతో జూన్ 15 నుంచి హాల్ మార్క్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. బంగారం స్వచ్ఛతకు ధ్రువీకరణే హాల్‌మార్కింగ్ ఉద్దేశం. ఇప్పటికే హాల్ మార్కింగ్ నగలనే పెద్ద పెద్ద ఆభరణ వర్తకులు విక్రయిస్తున్నారు.