Corona: కరోనా ఉన్నా.. లేదంటూ నకిలీ సర్టిఫికెట్.. అడ్డంగా బుక్కైన ఓ ఫ్యామిలీ.. ఆ తర్వాత ఏమైందంటే..?

|

Mar 10, 2021 | 4:24 PM

Forging Corona Test Report: కరోనా ఉధృతిని తగ్గించేందుకు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ప్రకటించింది. కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని

Corona: కరోనా ఉన్నా.. లేదంటూ నకిలీ సర్టిఫికెట్.. అడ్డంగా బుక్కైన ఓ ఫ్యామిలీ.. ఆ తర్వాత ఏమైందంటే..?
Corona-Tests
Follow us on

Forging Corona Test Report: దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసులు విలయతాండవం చేస్తున్నాయి. కొంతకాలం క్రితం భారీగా తగ్గిన కేసులు కాస్త.. ఇటీవల నిత్యం 10వేలకు పైగానే నమోదవుతున్నాయి. దీంతో కరోనా ఉధృతిని తగ్గించేందుకు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ప్రకటించింది. కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. ఇన్ని నియమనిబంధనలు అమలు చేస్తున్నా.. కొంతమంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తమకు కరోనా లేదంటూ ఓ కుటుంబం నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసుకొని ఏకంగా ప్రయాణానికి బయలుదేరింది. తీరా వారిని పరీక్షిస్తే కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అలా చేసిన కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు బృహిన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆర్థిక రాజధాని ముంబైలోని ఖార్‌కు చెందిన ఓ కుటుంబ సభ్యులు రాజస్థాన్‌లోని జైపూర్‌ వెళ్లాలనుకున్నారు. దీంతో కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేయించుకున్నారు. అందులో వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే వారు మాత్రం తమకు నెగెటివ్‌ అని నకిలీ రిపోర్ట్ చూపించి విల్లేపార్లే ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. కాగా.. వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యసిబ్బంది పాజిటివ్‌‌గా తేలినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టగా.. వారే నకిలీ రిపోర్టు సృష్టించారనే విషయం బయటపడింది.

దీంతో బీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కోవిడ్ మార్గదర్శకాలను పాటించని భార్యా భర్తలు, కూతురు (15)పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కుటుంబం చేసిన పని వారి ప్రాణాలకే కాకుండా, మొత్తం సమాజానికే హాని తలపెట్టేదిగా ఉందంటూ బీఎంసీ అదనపు మునిసిపల్ కమిషనర్‌ సురేశ్‌ కకానీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు తప్పనిసరిగా కోవిడ్‌-19 నిబంధనలను పాటించాలని సూచించారు.

Also Read: