Landslide: భారీ వర్షాలతో ఎటుచూసినా హృదయవిదారకం.. తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న శవాలు..

|

Jul 24, 2021 | 6:41 PM

Maharashtra rains: భారీ వర్షాలు ఆ రాష్ట్రంలో ప్రళయాన్ని సృష్టించాయి. ఎటు చూసినా నీరే.. ఆపై కురుస్తున్న వర్షాలతో ఆందోళన.. ఎటు నుంచి ప్రమాదం పొంచి వస్తోందో తెలియని ధీనస్థితిలో మహారాష్ట్ర ప్రజలు సతమతమవుతున్నారు. గత వారం నుంచి కురుస్తున్న

Landslide: భారీ వర్షాలతో ఎటుచూసినా హృదయవిదారకం.. తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న శవాలు..
Landslide
Follow us on

Maharashtra rains: భారీ వర్షాలు ఆ రాష్ట్రంలో ప్రళయాన్ని సృష్టించాయి. ఎటు చూసినా నీరే.. ఆపై కురుస్తున్న వర్షాలతో ఆందోళన.. ఎటు నుంచి ప్రమాదం పొంచి వస్తోందో తెలియని ధీనస్థితిలో మహారాష్ట్ర ప్రజలు సతమతమవుతున్నారు. గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతున్నది. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తున్నది. దీంతో ఎక్కడ చూసిన వరదలు ముంచెత్తాయి. కొండ చరియలు సైతం విరిగిపడుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 150 మంది వరకు మరణించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు, కొండ చరియలు విరిగిపడి వీరంతా మరణించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే.. చాలామంది ఆచూకీ లభించడం లేదు. దాదాపు 80 మంది వరకు కొండచరియల కింద కూరుకుపోయారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ దళాలు రాష్ట్రానికి చేరుకొని పలు ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

ఉదయం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 52 శవాలను వెలికి తీసినట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. రాయ్ ఘడ్, సతారాలో దాదాపు 70 మంది మట్టిలో కూరుకుపోయారు. ఇంకా వర్షాలు పడుతుండటంతో.. సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని పేర్కొంటున్నారు. ఇంకా గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1 లక్షమందిని పునరావాస, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వందలాది గ్రామాలు నీట మునగాయి. చాలా ఇళ్లు నేలకూలినట్లు అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.

ఇదిలాఉంటే.. శనివారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫోన్ చేసి మాట్లాడారు. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరద బాధితుల సహాయం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి గవర్నర్ రాష్ట్రపతికి వివరించారు.

Also Read:

షార్ట్‌లో వచ్చిన బాధితులకు పోలీస్ స్టేషన్‌లోకి నో ఎంట్రీ.. లేడీ పోలీసులు ఉన్నారంటూ..

Jowar Roti: ఆరోగ్యానికి మేలు చేసే జొన్న రోటీలు.. ప్రపంచంలో ఎన్ని దేశాలు జొన్నలను ఆహారంగా తీసుకుంటున్నాయో తెలుసా