Crime News: ప్రాణంగా ప్రేమించుకున్నారు.. కలిసుండాలని కలలు కన్నారు.. కానీ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో..

|

Sep 27, 2021 | 8:20 AM

Lovers Suicide: వారిద్దరూ రెండేళ్లుగా ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని కలకాలం జీవించాలని కలలు కన్నారు. ఈ క్రమంలో వారిద్దరి

Crime News: ప్రాణంగా ప్రేమించుకున్నారు.. కలిసుండాలని కలలు కన్నారు.. కానీ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో..
Lovers Suicide
Follow us on

Lovers Suicide: వారిద్దరూ రెండేళ్లుగా ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని కలకాలం జీవించాలని కలలు కన్నారు. ఈ క్రమంలో వారిద్దరి కులాలు వేరుకావడంతో ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. సూర్యాపేట పట్టణ పరిధిలోని సుందరయ్యనగర్‌కు చెందిన నాగమణి (24), సమీపంలోని దుబ్బతండాకు చెందిన ధరవత్‌ నెహ్రూ(28) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. నెహ్రూ స్థానికంగా సుతారి మేస్త్రీగా పనిచేస్తున్నాడు. నాగమణి నర్సింగ్‌ పూర్తిచేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది.

ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి ప్రేమ గురించి వారి వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే.. నాగమణి తల్లిదండ్రులు మాత్రం ప్రేమ పెళ్లికి నిరాకరించారు. అనంతరం మరో వ్యక్తితో వివాహం చేసేందుకు నిర్ణయించారు. తీరా ఈ విషయం తెలుసుకున్న నెహ్రూ దుబ్బతండాలోని తన నివాసంలో శనివారం ఉరేసుకొని చనిపోయాడు. నెహ్రూ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న ప్రియురాలు నాగమణి హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌- చందానగర్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైలు కింద పడి అదేరోజు రాత్రి ఆత్మహత్య చేసుకుంది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నాగమణిగా గుర్తించి ఆమె కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులు సుందరయ్యనగర్‌కు ఆదివారం తీసుకొచ్చారు. చేతికి అందివచ్చిన ఇరువురు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కాగా.. నాగమణి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాంపల్లి రైల్వే పోలీసులు తెలిపారు.

Also Read:

Manikonda Manhole Update: 34 గంటలు గడిచినా దొరకని ఆచూకీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..

Kareena Kapoor: ప్రభాస్ ట్రీట్ ఇస్తే ప్రపంచం ఫిదా అవ్వదా..! ‘ది బెస్ట్’ అంటూ కరీనా కపూర్ పోస్ట్