విషాదం: ఒకే చెట్టుకు ఉరి వేసుకున్న ప్రేమజంట..

నాగర్ కర్నూలు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పూర్తి వివరాలు..

విషాదం: ఒకే చెట్టుకు ఉరి వేసుకున్న ప్రేమజంట..
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 19, 2020 | 3:59 PM

నాగర్ కర్నూలు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ, ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఊరి చివరన ఒకే చెట్టుకు ఉరివేసుకుని ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పూర్తి వివరాలు పరిశీలించగా…

నాగూర్ కర్నూలు జిల్లాలోని బల్మూర్ మండలం బిల్లికల్లు ప్రాంతంలో ఒకే చెట్టుకు ఉరివేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మ‌ృతుల్లో అమ్మాయిది బిల్లకల్లు, అబ్బాయి చెంచు గూడెం ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. సాయంత్రం వేళ ఇద్దరు బైక్‌పై అటవీ ప్రాంతంలోకి వచ్చారని అనంతరం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. అయితే, ప్రేమ జంట ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.