మధ్యప్రదేశ్ లో దారుణం.. జైలులో యువతిపై గ్యాంగ్‌ రేప్‌?

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం జరిగింది. కాపాలా ఉండాల్సిన పోలీసులే కామాంధులుగా మారారు. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.

మధ్యప్రదేశ్ లో దారుణం.. జైలులో యువతిపై గ్యాంగ్‌ రేప్‌?
Balaraju Goud

|

Oct 19, 2020 | 3:11 PM

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం జరిగింది. కాపాలా ఉండాల్సిన పోలీసులే కామాంధులుగా మారారు. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. జైలులోని ఓ యువతిపై పోలీసులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేషన్‌ ఇన్‌చార్జ్‌తో సహా ఐదుగురు పోలీసులు 10 రోజుల పాటు యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు ఆ మహిళ ఆరోపించింది

రేవా జిల్లాలోని మాంగ్‌వాన్‌ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతి ఓ హత్య కేసులో నిందితురాలిగా ఉంది. దీంతో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అక్టోబర్‌ పదో తేదీన జైలును తనిఖీ చేసేందుకు అడిషనల్‌ జిల్లా జడ్జితో పాటు కొందరు న్యాయవాదులు వెళ్లగా ఈ విషయం బయటకు వచ్చింది. తనపై మే 9వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు ఐదుగురు పోలీసులు లాకప్‌లోనే అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని మూడు నెలల క్రితమే జైలు వార్డెన్‌కు చెప్పానని, అయినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించింది. కాగా, సదరు యువతిని అరెస్టు చేసిందే మే 21వ తేదీన అని, అడిషనల్‌ జిల్లా జడ్జి జ్యుడీషియల్‌ ఎంక్వైరీ ఆదేశాల నేపథ్యంలోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu