
Latest Crime: కరోనా నేపథ్యంలో ఉపాధి కరువై అప్పులు చేసి తీర్చలేక ఓ లారీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా అందరి మనసులను కలచివేస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి మండలం ఫసల్‌వాదికి చెందిన దర్జి రమేశ్ కొన్నేళ్లుగా లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరోనా వల్ల కొన్ని రోజులుగా లారీలు సరిగ్గా నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక చాలా మంది దగ్గర అప్పులు చేశాడు. అనంతరం వాటిని తీర్చలేక మనస్తాపానికి గురయ్యాడు. ఆయన తమ్ముడికి ఫోన్ చేసి అప్పులు తీర్చలేకపోతున్నానని అందుకే చనిపోతున్నానని చెప్పి మంజీరా వంతెనపై నుంచి దూకాడు. దీంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం.. ప్రియుడిని చంపిన ప్రియురాలు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..