AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోకల్ లీడర్‌ కాల్చివేత.. ఎక్కడో కాదు..

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో.. మొన్నటి వరకు క్రైం రేటు తగ్గిందనుకున్నారంతా.. కానీ లాక్‌డౌన్ 4.0 నుంచి 5.0 వచ్చే సరికి.. క్రైం రేటు మళ్లీ పెరుగుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం మండ్వాలీ పార్క్ సమీపంలో ఓ స్థానిక లీడర్‌ను కాల్చి చంపేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. మండ్వాలీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఓ పార్క్‌లో ఉదయం 7.30 నిమిషాలకు ఈ సంఘటన […]

లోకల్ లీడర్‌ కాల్చివేత.. ఎక్కడో కాదు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 03, 2020 | 8:17 PM

Share

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో.. మొన్నటి వరకు క్రైం రేటు తగ్గిందనుకున్నారంతా.. కానీ లాక్‌డౌన్ 4.0 నుంచి 5.0 వచ్చే సరికి.. క్రైం రేటు మళ్లీ పెరుగుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం మండ్వాలీ పార్క్ సమీపంలో ఓ స్థానిక లీడర్‌ను కాల్చి చంపేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. మండ్వాలీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఓ పార్క్‌లో ఉదయం 7.30 నిమిషాలకు ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిపారు. దుండుగులు కాల్చి పారిపోయిన వెంటనే.. అతడిని స్థానిక పట్‌పర్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడి ప్రాణాలు పోయినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు రాహుల్ బురుగా గుర్తించారు. అతడి శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇక మృతుడిపై మండ్వాలీ పోలీస్ స్టేషన్‌లో పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని.. అయితే ఇతడు స్థానిక మున్సిపల్ కార్పోరేషన్‌లో లీడర్‌గా ఉన్నారని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. కాగా, గతేడాది నవంబర్‌లో కూడా ఇతడిపై హత్యాయత్నం జరిగిందని తెలుస్తోంది.

Follow Us
Horoscope Today: వారికి జీతభత్సాలు పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి జీతభత్సాలు పెరిగే ఛాన్స్..
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?