Wyra: లోన్ యాప్స్ ట్రాప్‌లో చిక్కారో మీ లైఫ్ ఖతం.. న్యూడ్ ఫోటోలతో మీ పిక్స్ మార్ఫింగ్ చేసి…

|

Jun 04, 2022 | 9:01 AM

ఆన్ లైన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్న ఓ యువకుడికి వింత పరిస్థితి ఎదురైంది. యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించాడు.

Wyra: లోన్ యాప్స్ ట్రాప్‌లో చిక్కారో మీ లైఫ్ ఖతం.. న్యూడ్ ఫోటోలతో మీ పిక్స్ మార్ఫింగ్ చేసి...
Loan app
Follow us on

Quick Loan App Harassment: ఆన్ లైన్ యాప్ మోసాలకు ప్రజలు బలవుతూనే ఉన్నారు. దేశంలో ప్రతిరోజు ఇలాంటి కేసులు ఎక్కడో చోట నమోదవుతూనే ఉన్నాయి. ఆన్ లైన్ యాప్ నిర్వాహకుల మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. యాప్ ద్వారా లోన్ తీసుకొన్న బాధితుల పట్ల పైచాచికత్వాన్ని చాటుకున్నారు నిర్వాహకులు. తీసుకున్న లోన్ తిరిగి మూడు EMI ల రూపంలో చెల్లించనప్పటికీ తమకు రాలేదంటూ బాధితుడ్ని వేధింపులకు గురిచేస్తున్నారు. మార్పింగ్ ఫోటోతో తీవ్రంగా వేధిస్తున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) వైరాలో చోటుచేసుకుంది. ఆన్ లైన్ యాప్ లో బాధితుడు మూడు వేల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఫస్ట్ ఈఎమ్ఐ 1140 రూపాయలు, రెండు, మూడు ఈఎమ్ఐలు 1110 రూపాయల చొప్పున తిరిగి చెల్లించాడు. అయితే అతను కట్టిన లోన్ డబ్బులు తమకు రాలేదంటూ యాప్ నిర్వాహకులు వేధిస్తున్నారు. బాధితుడి ఫోన్ యాక్సిస్ చేసి అతని మార్పింగ్ ఫోటోలను అతని సంబంధించిన వాట్స్ యాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. అసభ్యకర ఇమేజ్ లు కొందరు మహిళలకు పంపడంతో అవాక్కయ్యాడు బాధితుడు. దీంతో నిర్వాహకుల వేధింపులతో తాళలేక లబోదిబోమంటూ బంధువులు, స్నేహితుల సాయంతో వైరా పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గత నెలలో వివాహిత ఆత్మహత్య

మంచిర్యాల జిల్లాలో లోన్‌ యాప్‌ వేధింపులకు గత నెలలో ఓ వివాహిత బలైంది. యాప్‌ నిర్వాహకుల వేధింపులను తాళలేక కళ్యాణి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆమహిళ ఫోటోలను న్యూడ్ పోటోలతో మార్ఫింగ్ చేసి పంపి డబ్బులు చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అవమాన భారంతో  పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసకుంది బాధితురాలు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి