రాచకొండ పోలీసుల అదుపులో లోన్ యాప్ కేటుగాళ్లు.. పట్టుబడినవారిలో ఓ చైనా జాతీయుడు

|

Jan 13, 2021 | 1:48 PM

రాచకొండ పోలీసులు మరో లోన్ యాప్ కేటుగాళ్లను అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, వారిలో ఒకరు చైనీయుడు..

రాచకొండ పోలీసుల అదుపులో లోన్ యాప్ కేటుగాళ్లు.. పట్టుబడినవారిలో ఓ చైనా జాతీయుడు
Follow us on

Loan App Operators : రాచకొండ పోలీసులు మరో లోన్ యాప్ కేటుగాళ్లను అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, వారిలో ఒకరు చైనీయుడు కూడా ఉన్నాడు. తాజాగా, రాచకొండ క్రైం పోలీసులు ముంబై కేంద్రంగా సాగుతున్న కాల్ సెంటర్ మీద దాడులు నిర్వహించారు. వారి బ్యాంక్ అకౌంట్‌లోని 28 కోట్ల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ లోన్ యాప్స్ వేధింపులు తాళలేక పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇన్ స్టంట్ యాప్స్‌లో లోన్లు తీసుకున్న తర్వాత వారి వేధింపులు ఎలా ఉంటాయో చెబుతూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గూగుల్ ప్లే స్టోర్లో అలాంటి యాప్స్ ఏమేం ఉన్నాయో వెంటనే గుర్తించాయి. ఆయా యాప్స్‌ను డిలీట్ చేయాల్సిందిగా గూగుల్‌కు లేఖ కూడా రాశాయి.

మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చాలా సార్లు సూచించింది. ఆర్‌బీఐ, ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనలకు లోబడి ఉన్న సంస్థల దగ్గరే రుణాలు తీసుకోవాలని తెలిపింది. కొన్ని యాప్స్ అధిక వడ్డీలు, రుసుములు తీసుకున్నట్టు తమకు తెలిసిందన్న ఆర్బీఐ… సులభంగా రుణాలు ఇస్తున్నారని యాప్‌ల మాయలో పడొద్దని సూచించిన సంగతి తెలిసిందేది. లోన్ యాప్స్‌ కోసం వ్యక్తిగత డాక్యుమెంట్లు ఎవరికీ ఇవ్వొద్దని పేర్కొంది. ఇక ఈ తరహా యాప్ మోసాలపై sachet.rbi.org.in వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే చాలా తెలిపింది.