Yadadri temple: యాదాద్రి ఘాట్‌రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం..

|

Jul 22, 2021 | 12:19 PM

నిర్మాణంలో ఉన్న యాదాద్రి గుట్ట ఘాట్‌రోడ్డు పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తయ్యారు.

Yadadri temple: యాదాద్రి ఘాట్‌రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం..
Yadadri Ghat Road Landslides
Follow us on

Yadadri Ghat Road Landslides: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ తడిసిముద్దవుతోంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కుండపోత వానలకు రహదారులు కొట్టుకుపోతున్నాయి. ఇదే క్రమంలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి గుట్ట ఘాట్‌రోడ్డు పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తయ్యారు. రెండవ ఘాట్‌రోడ్డులో ఈ సంఘటన జరగడంతో రోడ్డును బ్లాక్ చేశారు. కొండపైకి భక్తులు వెళ్లకుండా రాకపోకలు నిలిపివేశారు.

యాదాద్రి కొండపైకి వెళ్లే కొత్త ఘాట్‌ రోడ్డులో టూరిజం హోటల్‌ టర్నింగ్‌ దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు.. భక్తులకు ఇబ్బంది కలగకుండా మొదటి ఘాట్‌రోడ్డు ద్వారా అనుమతిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా గుట్టపైన నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే.. గుట్ట అభివృద్దిలో భాగంగా గుట్టను బ్లాస్ట్ చేసి రోడ్డును నిర్మించారు.

ఇదిలావుంటే, యాదాద్రి పునర్నిర్మాణ పనులపై భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేని వర్షాలకు నాణ్యత ప్రమాణాలు సరిగా పాటించకపోవడంతో కొండచరియలు విరిగిపడట్లు అధికారులు భావిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో కొండపై రాళ్లు కూలుతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also….  ముంచెత్తుతున్న భారీ వర్షాలు..దండిగా వచ్చి నదుల్లో చేరుతున్న వరద నీరు..:Heavy Rains Live Video.