Crime: ఫోటో చూసి సాఫ్ట్ అనుకోకండి.. పెద్ద నంగనాచి.. ఆ పనికి అడ్డొస్తున్నాడని కన్న బిడ్డనే
ఓ మహిళ.. తన కడుపున పుట్టిన బిడ్డను పాశవికంగా చిదిమేసింది. అసలు కారణం తెలిసి పోలీసులు నిర్ఘాంతపోయారు. కేరళ పాలక్కాడ్లో ఈ దారుణ ఘటన జరిగింది.
Mother Killed Son: బిడ్డనే చంపేసిన పైశాచికత్వం.. కన్నపేగునే చిదిమేసిన క్రూరత్వం.. ఈ మహాతల్లి గురించి ఏమని చెప్పాలి.. న్యాయస్థానాలు ఎలాంటి శిక్ష విధించాలి..? గుండెను కాస్తంత బిగువు చేసుకుని ఈ వార్తను చదవండి.. మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో తెలుసుకోండి. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. తన మూడేళ్ల కుమారుడ్ని అత్యంత దారుణంగా అంతమొందించింది ఓ మహిళ. కేరళ పాలక్కాడ్లోని ఏలప్పుళిలో జరిగిందీ దారుణ ఘటన. మహ్మద్ షామిర్, ఆసియా దంపతులకు మహ్మద్ షాన్ అనే 3 ఏళ్ల బిడ్డ ఉన్నాడు. చిన్నోడు మాట్లాడే ముద్దు..ముద్దు మాటలంటే చుట్టుపక్కల వారికి ఎంతో ఇష్టం. కాగా ఈ క్రమంలోనే ఊహించని ఘటన జరిగింది. మంగళవారం రోజు ఇంట్లో విగతజీవిగా కనిపించాడు పసివాడు. ఆసియాను అడిగితే తనకేం తెలియదని చెప్పింది. తన కుమారుడు ఉదయం నిద్రలేవలేదని.. ఖర్జూరం తిని అపస్మారక స్థితిలోకి వెళ్లాడని కల్లబొల్లి కబుర్లు చెప్పింది. పోలీసులకు మాత్రం ఆమె ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. అదుపులోకి తీసుకొని తమ స్టైల్లో విచారించగా అసలు నిజం బయటపడింది. చంపింది తానేనని పోలీసుల ముందు అంగీకరించింది.
ఆసియా భర్త షామిర్కు ఓ సమస్య ఉంది. అతను మాటలు సరిగా పలకలేడు. దీంతో ఏడాది కాలంగా భర్తకు దూరంగా ఉంటోంది ఆసియా. ఈ క్రమంలోనే ఆమె మరో వ్యక్తికి దగ్గరయింది. ఆసియాకు కుమారుడు ఉన్న విషయం అతనికి తెలియదు. కొంతకాలానికి అసలు విషయం తెలియడంతో.. ప్రియుడు ఆమెను దూరం పెట్టాడు. ఫోన్‌లో మాట్లాడేందుకు కూడా సాహసించలేదు. దీంతో ప్రియుడు తనకు ఎక్కడ దూరమవుతాడో అని భావించి తల్లే చిన్నారిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
Also Read: Hyderabad: పరుపుల మాటున పత్తి యాపారం.. తెలిస్తే బిత్తరపోవడం ఖాయం