Suicide: టీవీ ఛానల్ విషయంలో గొడవ.. అలిగిన బాలిక దారుణానికి ఒడిగట్టింది..

Minor girl suicide: టీవీలో ఛానెల్ మార్పు విష‌యంలో జ‌రిగిన వివాదం.. ఓ బాలిక నిండు ప్రాణాలు బలి తీసుకుంది. క్షణికావేశంలో ఆ బాలిక

Suicide: టీవీ ఛానల్ విషయంలో గొడవ.. అలిగిన బాలిక దారుణానికి ఒడిగట్టింది..
Girl Commits Suicide
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 20, 2021 | 12:53 PM

Minor girl suicide: టీవీలో ఛానెల్ మార్పు విష‌యంలో జ‌రిగిన వివాదం.. ఓ బాలిక నిండు ప్రాణాలు బలి తీసుకుంది. క్షణికావేశంలో ఆ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం కేర‌ళ ఇడుక్కిలోని మ‌న‌క్కాడ్‌లో చోటుచేసుకుంది. సోమవారం 11 ఏళ్ల బాలిక త‌న సోద‌రి, క‌జిన్‌ క‌లిసి ఇంట్లోనే టీవీ చూస్తున్నారు. ఈ సమయంలో ఇంట్లో త‌ల్లిదండ్రులు లేరు. వారు బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఆ చిన్నారుల మధ్య టీవీలో ఛానెల్ మార్పు విష‌యంలో స్వల్ప వివాదం జరిగింది. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాలిక‌.. ఇంట్లోనే కిటికీ గ్రిల్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

బాలిక‌ను గ‌మ‌నించిన నాయనమ్మ వెంటనే ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అనంతరం స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి పలు వివరాలు సేకరించారు. అనంతరం మృత‌దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇడుక్కి పోలీసులు వెల్లడించారు. కాగా ఆత్మహత్య చేసుకున్న బాలిక ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. బాలిక ఇంట్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Also Read:

Hyderabad: చిన్నారిపై తాత లైంగిక దాడి!.. రిపోర్ట్‌లో మాత్రం రివర్స్.. అసలు కారణం అదేనా?

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు.. అన్నంలో నిద్ర మాత్రలు కలిపి మరీ..