కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ కార్యదర్శిగా పనిచేసిన మాజీ సీఎస్ శివశంకర్‌ను ఎన్ఐఏ అధికారులు గురువారం విచారిస్తున్నారు. కొచ్చి ఎన్ఐఏ కార్యాలయానికి శివశంకర్ ను పిలిపించిన అధికారులు ఇవాళ విచారణ కొనసాగుతున్నది. బంగారం స్మగ్లింగ్ కేసులో శివశంకర్‌ను విచారించడం ఇది మూడవ సారి. స్మగ్లింగ్ కేసులో ఇప్పటికే స్వప్నా సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆరోపణలు రావడంతో కేరళ ప్రభుత్వం శివశంకర్‌ను సస్పెండ్ చేసింది. శివశంకర్ నుంచి డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ పోలీసులు విచారణ చేపడుతున్నారు. డిజిటల్ ఆధారాల కారణంగా తాము శివశంకర్‌ను విచారించనున్నట్లు ఈడీ పేర్కొంది. ఈ కేసులో 2టీబీ డేటాను సేకరించినట్లు ఎన్ఐఏ చెబుతుంది. బంగారం స్మగ్లింగ్ కేసులోనే విద్యాశాఖ మంత్రి కేటీ జలీల్‌ను కూడా ఎన్ఐఏ విచారించింది.