కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ సిబ్బంది కల్తీ కల్లు తయారీ వ్యాపారులతో కలిసి నిర్వహిస్తున్న నిషేధిత ఆల్ఫా జోలం దందాను హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు భగ్నం చేశారు. రెండు రోజుల క్రితం కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక కానిస్టేబుల్‌ను ఇద్దరు కల్లు తయారీదారులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నిషేధిత రూ.3 కోట్ల విలువ గల 30 కిలోల ఆల్ఫా జోలంను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
అల్ఫాజోలును కల్తీ కల్లులో తయారీలో వినియోగిస్తారు. కామారెడ్డి జిల్లాలో జరిగే కల్తీకల్లు కొందరు సిండికేట్‌గా ఏర్పడి మత్తు పదార్థాలను కలిపి విక్రయిస్తున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోని కామారెడ్డి ఎక్సైజ్ ఎస్‌హెచ్‌ఓ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే వ్యక్తి కల్లు తయారీదారులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు బయటపడ్డాయి. వారి కోసం ఏకంగా ఆల్ఫా జోలం దందాను నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి.
ఈనేపథ్యంలో పక్కా సమాచారంతో కానిస్టేబుల్‌తోపాటు మరో ఇద్దరిని హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ వారు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరి కొంతమంది ఎక్సైజ్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు నార్కోటిక్స్ అధికారులు. ఈ విషయంపై కామారెడ్డి ఎక్సైజ్ సూపరిండెంట్ రవీందర్ రాజ్, కామారెడ్డి ఎక్సైజ్ ఎస్‌హెచ్ఓ విక్రమ్‌లను వివరణ కోరగా, తమకు విషయం తెలిసిందని లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…