YS Viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అప్‌డేట్.. మారణాయుధాల కోసం అక్కడ గాలింపు

|

Aug 07, 2021 | 2:50 PM

మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు పురోగతి సాధించారు.

YS Viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అప్‌డేట్.. మారణాయుధాల కోసం అక్కడ గాలింపు
Ys Viveka Murder Case
Follow us on

మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు పురోగతి సాధించారు. హత్యకు సంబంధించిన ఆయుధాల కోసం పులివెందుల తూర్పు ఆంజనేయస్వామి గుడిపక్కన వాగులో సీబీఐ తనిఖీలు చేపట్టింది. సునీల్ యాదవ్‌ను పులివెందుల తీసుకెళ్లిన అధికారులు.. అతడిచ్చిన వివరాలతో ఆయుధాల కోసం గాలింపు చేపట్టారు. రెండు మున్సిపల్ ట్యాంకర్లతో వాగులోని నీటిని తోడిస్తున్నారు. పోలీస్ ఎస్కార్ట్ సెక్యూరిటీ మధ్య సునీల్‌ను  సెంట్రల్ జైల్ నుంచి బయటికి  తీసుకువచ్చి సీబీఐ బృందాలు ఆయుధాల కోసం గాలింపు సాగిస్తున్నాయి. పులివెందులలోని రోటరీపురం వద్ద ఉన్న బ్రిడ్జి కింద ఉన్న డ్రైనేజ్‌లో కూడా మారణాయుధాల కోసం గాలింపు కొనసాగుతుంది.

 

ఈ కేసులో అనుమానితుడు సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు ఇటీవల గోవాలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టులో హాజరపరిచారు. అక్కడి నుంచి ట్రాన్సిట్ రిమాండ్‌లో కడప సెంట్రల్ జైలుకు తరలించారు.  ఇప్పటికే సీబీఐ సునీల్ యాదవ్‌ను పలుసార్లు ప్రశ్నించి.. కీలక సమాచారం సేకరించింది. పులివెందులలో నివాసానికి తాళం వేసి సునీల్ కుటుంబంతో పరారయ్యాడు. కొద్దిరోజులుగా సునీల్ కోసం సీబీఐ అధికారులు గాలిస్తుండగా చివరికి దొరికాడు.

అంతకముందు సునీల్‌తో పాటు ఆయన తమ్ముడు కిరణ్‌యాదవ్‌, తల్లిదండ్రులు సావిత్రి, కృష్ణయ్య యాదవ్‌లను సీబీఐ ప్రశ్నించింది. అయితే విచారణ పేరుతో సీబీఐ తమను వేధిస్తోందని, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని సునీల్‌ హైకోర్టుకు వెళ్లారు. వివేకా కేసులో కడప సెంట్రల్ జైల్ గెస్ట్‌హౌస్‌లో విచారణ జరుపుతున్నారు. నేటితో 62 రోజులుగా ఈ కేసులో సీబీఐ విచారణ సాగుతుంది.

Also Read: భారత్‌లో అందుబాటులోకి మరో కోవిడ్-19 వ్యాక్సిన్‌.. జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

 అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించిన చిత్తూరు యువకుడు