జగిత్యాల వాసికి ఉగ్రలింకులు..! కశ్మీర్ పోలీసులకు పట్టించిన గూగుల్‌పే..

|

Mar 04, 2020 | 7:57 AM

గూగుల్ పే..ఇప్పుడు చాలా మంది జీవితాల్నే మార్చేస్తుంది. మొన్న ఆ మధ్య ఏపీలో ఓ వ్యక్తికి గూగుల్ పే స్క్రాచ్ కార్డు ద్వారా ఏకంగా లక్ష రూపాయలు లభించాయి. ఇదిలా ఉంటే, తెలంగాణలో మాత్రం గూగుల్ పే ద్వారా స్నేహితుడికి డబ్బులు పంపినందుకు గానూ ఏకంగా జమ్మూ కశ్మీర్ పోలీసులే రంగంలోకి అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతకీ అతడు చేసిన నేరం ఏంటీ..? అసలేం జరిగింది..?..

జగిత్యాల వాసికి ఉగ్రలింకులు..! కశ్మీర్ పోలీసులకు పట్టించిన గూగుల్‌పే..
Follow us on

గూగుల్ పే..ఇప్పుడు చాలా మంది జీవితాల్నే మార్చేస్తుంది. మొన్న ఆ మధ్య ఏపీలో ఓ వ్యక్తికి గూగుల్ పే స్క్రాచ్ కార్డు ద్వారా ఏకంగా లక్ష రూపాయలు లభించాయి. ఇదిలా ఉంటే, తెలంగాణలో మాత్రం గూగుల్ పే ద్వారా స్నేహితుడికి డబ్బులు పంపినందుకు గానూ ఏకంగా జమ్మూ కశ్మీర్ పోలీసులే రంగంలోకి అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతకీ అతడు చేసిన నేరం ఏంటీ..? గూగుల్ పే లో డబ్బు పంపితేనే కశ్మీర్ పోలీసులు ఎందుకు అతన్ని విచారిస్తున్నారు..? అసలేం జరిగింది..? వివరాల్లోకి వెళితే…

రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కుస్థాపూర్‌ గ్రామానికి చెందిన లింగన్న అనే వ్యక్తి దుబాయ్‌లో ఉంటున్న తన స్నేహితుడి సూచన మేరకు రాకేశ్ అనే వ్యక్తికి రూ.5 వేల నగదును గూగుల్‌ పే యాప్‌ ద్వారా బదిలీ చేశాడు. అయితే.. జమ్ముకశ్మీర్‌ పోలీసులు రాకేశ్‌ను ఇప్పటికే దేశద్రోహం కింద అరెస్టు చేసి విచారిస్తున్నారు. అతడి బ్యాంక్ వివరాలను ఆరా తీయగా.. లింగన్న అనే వ్యక్తి అతడికి డబ్బులు పంపాడని తేలింది. ఈ విషయాన్ని గుర్తించిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు లింగన్నను అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని ఓ పోలీస్‌ స్టేషన్‌పై దాడి కేసులో రాకేశ్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అతడి బ్యాంక్‌ అకౌంట్లు పరిశీలిస్తున్న క్రమంలో కుస్థాపూర్‌ వాసి లింగన్న అతడికి డబ్బులు జమ చేసినట్లు తేలింది. దీంతో కశ్మీర్ పోలీసులు తెలంగాణకు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు రాబట్టేందుకు ప్రస్తుతం అతణ్ని మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు.