IT Raids on MP Ayodhya Ram Reddy company : వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రాంరెడ్డికి చెందిన రాంకీ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న రాంకీ ప్రధాన కార్యాలయంలో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు రాంకీ సంస్థ అనుబంధ కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఐటీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డికి చెందిన రాంకీ సంస్థ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. సంస్థలతోపాటు ఎంపీ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పలు లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఐటీ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని పేర్కొంటున్నారు. 15 చోట్ల ఒకేసారి ప్రారంభమైన దాడులు.. మధ్యాహ్నం నాటికి కూడా కొనసాగుతున్నాయి.
Also Read;