పరీక్షల పేరుతో మహిళలపై అత్యాచారం..ఊచలు లెక్కిస్తున్న కీచక డాక్టర్‌

భారత సంతతికి చెందిన ఎంతోమంది విదేశాల్లో స్థిరపడుతున్నారు. ఉన్నత పదవులు, మంచి ఉద్యోగాల్లో ఉంటూ మదర్‌ లాండ్‌తో పాటు తాముంటున్న కంట్రీకి సేవలు చేస్తూ మంచి పేరు సంపాదిస్తున్నారు. కానీ కొంతమంది ప్రబుద్ధులు మాత్రం పాడు పనులు చేస్తూ దేశానికే అప్రతిష్ట తీసుకొస్తున్నారు. తాజాగా లండన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ డాక్టర్‌..తన దగ్గరకు చికిత్సకోసం వచ్చే స్త్తీల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తెచ్చి చివరికి దేశం […]

పరీక్షల పేరుతో మహిళలపై అత్యాచారం..ఊచలు లెక్కిస్తున్న కీచక డాక్టర్‌

Edited By:

Updated on: Dec 12, 2019 | 3:28 PM

భారత సంతతికి చెందిన ఎంతోమంది విదేశాల్లో స్థిరపడుతున్నారు. ఉన్నత పదవులు, మంచి ఉద్యోగాల్లో ఉంటూ మదర్‌ లాండ్‌తో పాటు తాముంటున్న కంట్రీకి సేవలు చేస్తూ మంచి పేరు సంపాదిస్తున్నారు. కానీ కొంతమంది ప్రబుద్ధులు మాత్రం పాడు పనులు చేస్తూ దేశానికే అప్రతిష్ట తీసుకొస్తున్నారు. తాజాగా లండన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ డాక్టర్‌..తన దగ్గరకు చికిత్సకోసం వచ్చే స్త్తీల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తెచ్చి చివరికి దేశం కాని దేశంలో ఊచలు లెక్కిస్తున్నాడు.

మనీష్‌ నట్వర్‌లాల్‌ షా అనే భారత సంతతి డాక్టర్‌..1993లో లండన్‌ యూనివర్సిటీ నుంచి డాక్టర్‌ డిగ్రీ తీసుకొని జనరల్‌ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్నాడు. ఐతే తన వద్దకొచ్చే పేషెంట్లకు చికిత్స చేయాల్సింది పోయి వారి పట్ల వికృత చేష్టలకు దిగాడు. తాకరాని చోట తాకుతూ పైశాచికానందం పొందాడు. ఐతే ఓ మహిళ ఫిర్యాదుతో ఆ వైద్యుడు చేస్తున్న కీచకపర్వం మొత్తం తీగ లాగితే డొంకంతా కదిలింది.

హాలీవుడ్‌ స్టార్‌ ఏంజిలినా జోలి  ముందస్తుగా  చేయించుకున్న బ్రెస్ట్‌ కేన్సర్‌ ట్రీట్‌మెంట్‌ గురించి చెప్పేవాడు. ఆ తర్వాత టెస్టులు చేయించుకోవాలంటూ ప్రైవేట్‌ పార్ట్స్‌లో చేతులు వేస్తూ వెకిలిగా ప్రవర్తించేవాడు. మరికొందరిపై అత్యాచారం కూడా చేశాడు. ఇలా మొత్తం దాదాపు 25 మంది మహిళలను కేన్సర్‌ చికిత్స పేరుతో లైంగిక వేధింపులకు గురి చేశాడు. 2009 నుంచి 2013 మధ్య ఆరుగురు మహిళల పట్ల వికృతంగా ప్రవర్తించాడు ఈ డాక్టర్‌. వీరే కాకుండా గతంలో కూడా మరో 17 మంది మహిళలను ఇలానే లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఫిర్యాదులున్నాయి. దీంతో 2013లో అతన్ని ప్రాక్టీస్‌ రద్దు చేసిన అధికారులు..సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. ఈ కేసుపై  విచారణ జరిపిన లండన్ కోర్టు..తీర్పును వచ్చే ఏడాది ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.