Maoists vs Police: దంతేవాడలో రెచ్చిపోయిన మావోయిస్టులు.. పోలీసులే టార్గెట్‌గా ఐఈడీ బాంబ్ బ్లాస్ట్..

|

Aug 05, 2021 | 1:10 PM

Maoists vs Police: చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. మలేవాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని

Maoists vs Police: దంతేవాడలో రెచ్చిపోయిన మావోయిస్టులు.. పోలీసులే టార్గెట్‌గా ఐఈడీ బాంబ్ బ్లాస్ట్..
Bomb Blast
Follow us on

Maoists vs Police: చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. మలేవాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోటియా రహదారిపై ఐఈడీ బాంబ్‌ను పేల్చారు మావోయిస్టులు. ఈ ఘటనలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు చనిపోగా.. 11 మందికిపైగా తీవ్ర గాయలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దంతేవాడ ఎస్పీ కమలేషన్ కశ్యప్ తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు ప్రయాణికులు బొలెరో వాహనంలో నారాయణపూర్ నుంచి దంతేవాడకు వెళ్తున్నారు. అదే సమయంలో ఘోటియా రహదారి సమీపానికి చేరుకోగానే.. మావోయిస్టులు అప్పటికే ఏర్పాటు చేసిన ఐఈడీ బాంబ్‌ని పేల్చారు.

ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా.. మరికొంతమందికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు, భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం గీధం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన పలువురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే, ఈ బొలెరో వాహనంలో పోలీసులు ప్రయాణిస్తున్నారన్న అనుమానంతో మావోయిస్టులు బాంబ్‌ పేల్చినట్లు తెలుస్తోంది.

కాగా, ఇటీవలి కాలంలో మావోయిస్టులపై దేశ వ్యాప్తంగా భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కరోనా విజృంభన సమయంలోనూ భద్రతా దళాలు.. మావోల వేటను ఆపలేదు. ఎన్నో ఎన్‌కౌంటర్ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంతో మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఇటీవల కూడా మావోయిస్టులు-పోలీసుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిన దాఖలాలు ఉన్నాయి. దాంతో భద్రతా దళాలపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు మావోయిస్టులు. ఈ నేపథ్యంలోనే.. ఇవాళ పోలీసులు టార్గెట్‌గా బాంబు దాడికి పాల్పడ్డారు. అయితే, వారి ప్లాన్ ఫెయిల్ అయి సాధారణ ప్రయాణకుల ప్రాణాలమీదకు వచ్చింది.

Also read:

ప్రపంచంలోనే అత్యంత పురాతమైన నగరాలు.. ఇప్పటికీ చెక్కు చెదరకుండా.. ఎక్కడున్నాయో తెలుసా..

WhatsApp New Feature: ఇక నుంచి చూసుకుందాం.. వాట్సాప్‌ డెస్క్‌టాప్ వెర్షన్‌లో అది కూడా

Rahul Gandhi: న్యాయవాది ఫిర్యాదు… రాహుల్ గాంధీపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు