Crime News: ఒకరితో ఇద్దరి అక్రమ సంబంధం.. అసలు సంగతి తెలిసి.. కత్తులతో దారుణంగా..

|

Oct 06, 2021 | 7:55 AM

Illegal Affair: హైదరాబాద్ నగరంలోని ఫలక్​నుమాలో సంచలనం సృష్టించిన షేక్​ అబ్బాస్ హత్య కేసు మీస్టరీని ఫలక్​నుమా పోలీసులు ఛేదించారు. తాను కొనసాగిస్తున్న

Crime News: ఒకరితో ఇద్దరి అక్రమ సంబంధం.. అసలు సంగతి తెలిసి.. కత్తులతో దారుణంగా..
Crime News
Follow us on

Illegal Affair: హైదరాబాద్ నగరంలోని ఫలక్​నుమాలో సంచలనం సృష్టించిన షేక్​ అబ్బాస్ హత్య కేసు మీస్టరీని ఫలక్​నుమా పోలీసులు ఛేదించారు. తాను కొనసాగిస్తున్న మహిళతోనే షేక్​అబ్బాస్​ కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న నేపంతో ఓ యువకుడు.. మరోకరితో కలిసి కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు యువకులను ఫలక్​నుమా పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఫలక్​నుమా ఇన్స్పెక్టర్​ దేవేందర్​తెలిపిన వివరాల ప్రకారం… గుల్జార్​నగర్​మదీనా మసీదు ప్రాంతానికి చెందిన షేక్​అబ్బాస్​(22) జీహెచ్ఎంసిలో కాంట్రాక్ట్​ పద్దతిలో ఎలక్ర్టిషన్‌గా విధులు నిర్వహించేవాడు. షేక్​అబ్బాస్‌కు మూడు నెలల క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. ఈ నెల 1వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన షేక్​అబ్బాస్​ ఫోన్​వచ్చిందని ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. కేవలం10 నిమిషాల వ్యవధిలోనే షేక్​అబ్బాస్‌పై కత్తులతో దాడి చేశారని కుటుంబ సభ్యులకు తెలిసింది. తీవ్రంగా గాయపడిన అబ్బాస్‌ను​చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుని తల్లి ఖాదర్‌బీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలక్​నుమా పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. కీలక విషయాలు వెల్లడయ్యాయి. అచ్చిరెడ్డినగర్‌కు చెందిన మహ్మద్​పర్వేజ్​(23), నవాబ్ సాహెబ్​కుంటకు చెందిన షేక్​అక్రమ్​(24)లు షేక్​అబ్బాస్​పై కత్తితో దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుడు మహ్మద్​పర్వేజ్‌ గత ఏడు సంవత్సరాలుగా ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే మృతుడు షేక్​అబ్బాస్​కూడా సదరు మహిళతోనే 18 నెలల నుంచి అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది. అయితే.. ఆ మహిళతో షేక్​అబ్బాస్​సన్నిహితంగా ఉంటున్న విషయాన్ని మహ్మద్​పర్వేజ్​ గమనించాడు. దీంతో అబ్బాస్‌తో దూరంగా ఉండాలని మహిళను మహ్మద్​పర్వేజ్​హెచ్చరించాడు. అయినప్పటికీ.. వారిమధ్య సంబంధం కొనసాగుతుందని గమనించిన పర్వేజ్.. అబ్బాస్​ను చంపాలని అక్రమ్‌తో కలిసి హత్యకు కుట్రపన్నాడు. ఈ నేపధ్యంలోనే శుక్రవారం రాత్రి షేక్​అబ్బాస్‌కు ఫోన్​చేసిన మహ్మద్​పర్వేజ్, అక్రమ్ ఇంటి నుంచి బయటికి రాగానే ఓ కిరాణా జనరల్​స్టోర్​వద్ద అడ్డగించి కత్తులతో దాడి చేసి చంపారని దేవేందర్ తెలిపారు. వారిద్దరినీ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

నూర్ మహమ్మద్, టీవీ9 తెలుగు, రిపోర్టర్, హైదరాబాద్

Also Read:

Cheddi Gang: తిరుపతివాసుల్లో వణుకుపుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్.. ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు..

Crime News: ఆహారంలో మత్తు మందు కలిపి.. ప్రియుడికి ఫోన్ చేసి.. దారుణానికి ఒడిగట్టిన భార్య..