AP IIT Ragging: ఏపీలో ర్యాగింగ్ భూతం కలకలం.. తాడేపల్లిగూడెం నిట్‌‌లో విద్యార్థిని చితకబాదిన సీనియర్లు

|

Mar 25, 2022 | 7:36 AM

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ర్యాగింగ్‌ భూతం జడలు విప్పింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌ ప్రాంగణంలో జూనియర్‌ విద్యార్థిపై తొమ్మిది మంది సీనియర్లు విచక్షణారహితంగా దాడి చేశారు.

AP IIT Ragging: ఏపీలో ర్యాగింగ్ భూతం కలకలం.. తాడేపల్లిగూడెం నిట్‌‌లో విద్యార్థిని చితకబాదిన సీనియర్లు
Ap Iit Ragging
Follow us on

AP IIT Campus Ragging: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో మరోసారి ర్యాగింగ్‌ భూతం జడలు విప్పింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం(Tadepalligudem)లోని ఏపీ నిట్‌ ప్రాంగణంలో జూనియర్‌ విద్యార్థిపై తొమ్మిది మంది సీనియర్లు విచక్షణారహితంగా దాడి చేశారు. తాడేపల్లిగూడెం నిట్ క్యాంపస్‌లో దారుణం చోటు చేసుకుంది. సెకండ్ ఇయర్ మెకానికల్ చదువుతున్న యడ్లపల్లి జయకిరణ్‌ను థర్డ్, ఫోర్త్ ఇయర్ చదువుతోన్న విద్యార్థులు విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటనపై పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ ఆకుల రఘు కథనం ప్రకారం.. జూనియర్‌ విద్యార్థిని మూడు నెలలుగా కొందరు సీనియర్లు ర్యాగింగ్‌ చేస్తున్నారని తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్యాంపస్‌లో పలు సందర్బాల్లో జయకిరణ్ ను కామెంట్స్ చేయడం, తిట్టడంతో జయకిరణ్ అన్ నోన్ నంబర్ నుంచి వారికి మెసేజ్‌లు పంపించాడు. ఈ విషయం తెలుకున్న విద్యార్థులు పథకం ప్రకారం జయకిరణ్‌ను సీనియర్లు రూమ్‌కు పిలిపించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి కేబుల్ వైర్ , మగ్గులు, సెల్ ఫోన్లతో విచక్షణా రహితంగా కొట్టారు. రాత్రి 11 నుంచి తెల్లవారే వరకు దాడిచేయటంతో జయకిరణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అయితే దాడిసమయంలో ఫోటోలు ,వీడియో లు తీసిన సీనియర్ విద్యార్థులు వాటిని క్యాంపస్లో సర్క్యు‌లేట్ చేశారు. దీంతో బయటకు విషయం పొక్కింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న బంధువులు.. పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై ర్యాగింగ్ యాక్ట్ తో పాటు దాడి, అక్రమనిర్బంధం వంటి సెక్షన్లపై కేసు నమోదు చేశారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read Also…  Clay Competition: పిడికెడు పుట్టమట్టి కోసం యమ గిరాకీ.. కొన్ని రోజుల ముందే రిజర్వేషన్ చేసుకుంటున్న జనం