Crime News: వీడు మామూలోడు కాదు.. ఒక అమ్మాయితో స్నేహం.. 50 మంది మైనర్లు, టీచర్లకు వల.. చివరకు..

|

Oct 08, 2021 | 8:04 AM

IIT-K student stalked minors, teachers: ఐఐటీ అనగానే.. టాప్ ప్లేస్‌మెంట్.. రూ.లక్షల్లో ఉద్యోగం అని అందరూ ఆలోచిస్తుంటారు. కానీ.. అలాంటి ఆలోచనలో

Crime News: వీడు మామూలోడు కాదు.. ఒక అమ్మాయితో స్నేహం.. 50 మంది మైనర్లు, టీచర్లకు వల.. చివరకు..
Crime News
Follow us on

IIT-K student stalked minors, teachers: ఐఐటీ అనగానే.. టాప్ ప్లేస్‌మెంట్.. రూ.లక్షల్లో ఉద్యోగం అని అందరూ ఆలోచిస్తుంటారు. కానీ.. అలాంటి ఆలోచనలో ఐఐటీలో చేరిన విద్యార్థి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అమ్మాయిలు, అధ్యాపకుల ఫోటోల‌ను మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తూ చివరికి కటకటాల పాలయ్యాడు. అధ్యాపకులు, విద్యార్థినులను వేధిస్తున్న ఓ యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహావీర్ కుమార్ (19) అనే యువకుడు ఖరగ్‌పూర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రెండో ఏడాది చదువుతున్నాడు. గత కొంత కాలంగా అతను నార్త్ ఢిల్లీలోని ఓ పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థినుల‌ను, ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేసినట్లు ఢిల్లీ నార్త్ డీసీసీ సాగర్ సింగ్ కల్సి వెల్లడించారు. బాధితులను సంప్రదించడానికి మహావీర్ నకిలీ కాలర్ ఐడి, వాట్సప్‌లో వర్చువల్ నంబర్ల కోసం యాప్‌లను ఉపయోగించేవాడని పేర్కొన్నారు.

మహవీర్ తెలివిగా తన ఐడెంటిటీ దాచేందుకు, అతను వాయిస్ మార్చే యాప్‌ని కూడా ఉపయోగించేవాడని తెలిపారు. అమ్మాయిల పేర్లపై న‌కిలీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసిన బాధితుల మార్ఫింగ్ ఫోటోల‌ను షేర్‌ చేసేవాడని తెలిపారు. చివరకు బాధిత విద్యార్థినులు.. యాజమాన్యానికి తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తును ప్రారంభించిన ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అతన్ని పట్టుకున్నారు. విచారణలో విస్తుపోయే అంశాలు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు.. ఇంట‌ర్నేష‌న‌ల్ నెంబ‌ర్స్ నుంచి కూడా టీచర్లు, బాలికలకు ఫోన్ కాల్ చేసి వేధించిన‌ట్లు తెలిసింది.

మహవీర్ మొదట ఢిల్లీలోని ఓ విద్యార్థినితో 2019లో పరిచయం ఏర్పరుచుకున్నాడు. అనంతరం విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమె ఫ్రెండ్స్‌తో కూడా పరిచయం పెంచుకున్నాడు. అయితే.. ఆన్‌లైన్ క్లాసుల లింకులను విద్యార్థిని షేర్ చేయడంతో.. దాని ద్వారా వారందరి నెంబర్లు తీసుకొని వేధించడం మొదలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఐఐటీ విద్యార్థి కావడంతో పలు టెక్నాల‌జీల ద్వారా వేధించడం మొదలు పెట్టాడని.. వారిలో మైన‌ర్ బాలిక‌లు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్ క్లాసుల కోసం క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపుల్లోకి చొర‌బ‌డి అసభ్యకరంగా మెస్సెజ్‌లు చేసేవాడని తెలిపారు.

పాట్నా నుంచి ఇదంతా జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో చ‌ట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Crime News: స్కూలుకు వెళ్లొస్తానమ్మా అంటూ వెళ్లాడు.. అవే చివరి మాటలయ్యాయి.. తేలు కాటేయ్యడంతో..

TS High Court: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..16 ఏళ్ల బాలిక అబార్షన్‌కి అనుమతి