Nellore: నెల్లూరులో అగ్నిప్రమాదం.. హైదరాబాద్‌ మహిళ సజీవ దహనం.. దర్గాకు వచ్చి..

Nellore fire accident: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు (Nellore) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏఎస్‌ పేటలో షఫా బావి వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంటికి

Nellore: నెల్లూరులో అగ్నిప్రమాదం.. హైదరాబాద్‌ మహిళ సజీవ దహనం.. దర్గాకు వచ్చి..
Fire Accident

Updated on: Jan 28, 2022 | 10:55 AM

Nellore fire accident: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు (Nellore) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏఎస్‌ పేటలో షఫా బావి వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంటికి నిప్పంటుకుని హైదరాబాద్‌ (Hyderabad) కు చెందిన ఓ మహిళ సజీవ దహనం కాగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. షార్ట్‌ సర్క్యూట్‌తోనే అగ్నిప్రమాదం (fire accident) జరిగినట్లు పేర్కొంటున్నారు. దీంతో గుడిసెకు మంటలు అంటుకున్నాయని తెలిపారు. కాగా.. బాధితులు హైదరాబాద్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. మృతురాలు ఫాతిమా ముష్రఫ్ గా గుర్తించారు. మతిస్థిమితం బాగాలేకపోవడంతో దర్గాకు వచ్చారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే.. గ్రామంలో ప్రసిద్ధిగాంచిన దర్గా ఉండటంతో.. మతిస్థిమితం లేని వారిని గ్రామంలో ఉంచి చికిత్సలు అందించడం ఇక్కడి ప్రత్యేకత. బాధితులను వారి కుటుంబసభ్యులు ఇక్కడ వదిలిపెట్టి వెళుతుంటారు. అయితే.. వారి బాగోగులు చూసుకునేందుకు అనధికారికంగా విచ్చలవిడిగా గ్రామంలో సంరక్షణ కేంద్రాలు వెలిసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పలు కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Crime News: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య..

Crime News: భార్యపై ప్రేమతోనే చైన్​స్నాచింగ్​ వైపు.. ఏకంగా సెంచరీ కొట్టాడు.. కీలక విషయాలు