Crime News: కొడుకు మాటలు నమ్మి భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. నేరుగా స్టేషన్‌కు వెళ్లడంతో పోలీసుల షాక్!

|

Nov 08, 2021 | 8:39 PM

మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. ఏడు అడుగుల సాక్షిగా ఏకమైన బంధానికే నమ్మకం లేకుండా పోతోంది. క్షణికావేశం నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాళి కట్టిన భర్తే కడతేర్చింది ఓ వివాహిత.

Crime News: కొడుకు మాటలు నమ్మి భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. నేరుగా స్టేషన్‌కు వెళ్లడంతో పోలీసుల షాక్!
Murder
Follow us on

Hyderabad Wife Killed Husband: మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. ఏడు అడుగుల సాక్షిగా ఏకమైన బంధానికే నమ్మకం లేకుండా పోతోంది. క్షణికావేశం నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాళి కట్టిన భర్తే కడతేర్చింది ఓ వివాహిత. అత్యంత దారుణంగా హతమార్చింది. పరీక్ష రాయడానికి వెళ్లిన భార్యపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్న కోపంతో కత్తితో పొడిచి చంపింది ఓ భార్య. ఈ దారుణ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది. సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం బూసిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన బూసిరెడ్డి మురళీధర్ రెడ్డి, మౌనిక దంపతులు ఉద్యోగరీత్యా హైదరాబాద్ కి వచ్చి సరూర్‌నగర్‌లోని సాయి క్రిష్ణ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. మురళీధర్ రెడ్డి హైటెక్ సిటీలోని ఒక హార్డ్ వేర్ కంపెనీలో ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. భార్య మౌనిక కూడా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఇదిలావుంటే, ఈ నెల ఆరవ తేదీన మౌనిక బిఏ థర్డ్ ఇయర్ పరీక్షలు రాయడానికి గుంటూరులోని గురజాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి రావడం జరిగింది. అయితే, ఆమె కొడుకు తండ్రి తనతో అన్న మాటలను తల్లికి వివరించాడు. “అమ్మ ఎగ్జామ్ రాయడానికి వెళ్లాక నాన్న నీ గురించి అందరికీ తప్పుగా చెప్పాడని” చెప్పడంతో, దంపతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో గొడవ తీవ్ర స్థాయికి చేరుకుని క్షణికావేశంలో ఆవేశానికి గురైన మౌనిక.. అతడిని ఇంట్లోనే చాకుతో పొడిచి అత్యంత దారుణంగా హతమార్చింది. అనంతరం నేరుగా సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మౌనికను అరెస్టు చేసిన పోలీసులు.. ఆమె వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Read Also….  Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. సమయ వేళలు మారే అవకాశం..