Crime News: పంజాగుట్ట చిన్నారి హత్య కేసు.. బయటపడ్డ సీసీటీవీ ఫుటేజ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

Hyderabad Crime News: హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో ఐదేళ్ల బాలిక మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం

Crime News: పంజాగుట్ట చిన్నారి హత్య కేసు.. బయటపడ్డ సీసీటీవీ ఫుటేజ్.. వెలుగులోకి సంచలన విషయాలు..
Crime News

Edited By: Anil kumar poka

Updated on: Nov 08, 2021 | 5:05 PM

Hyderabad Crime News: హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో ఐదేళ్ల బాలిక మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన భాగ్యనగరంలో కలకలం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక మృతిని పోలీసులు హత్యగా నిర్ధారించారు. కడుపులో బలంగా తన్నడం వల్లే ఆ బాలిక చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఓ మహిళ బాలిక మృతదేహాన్ని పంజాగుట్టలో వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారిని ఎక్కడో చంపేసి నిందితులు ద్వారకాపురి కాలనీలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించారు. ముసుగు ధరించిన మహిళ బాలికను ఆటోలో తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్లు పోలీసులు గుర్తించారు.  అయితే నిందితులు వెళ్లిన మార్గంలో ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం నాలుగు పోలీస్‌ బృందాలతో, మూడు టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో గాలిస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. అంతేకాకుండా..  అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా అప్రమత్తం చేశారు.

ఈ నెల 4న (గురువారం) పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ద్వారకపురి కాలనీలో టెన్నిస్ కోర్టు దగ్గరనున్న షాపు పక్కన గుర్తు తెలియని చిన్నారి మృతదేహం లభ్యమైంది. రోజు రాత్రి అమావాస్య కావడంతో చిన్నారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పంజాగుట్ట పోలీసులు హత్య కేసు నమోదు చేసి.. పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Also Read:

Crime News: గొడవ అవుతుందని వెళితే.. పోలీస్ అధికారినే చితకబాదారు.. తాళ్లతో కట్టేసి దారుణంగా..