Hyderabad Police: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కాడు.. పేరు తప్పు చెప్పి.. మళ్లీ అడ్డంగా బుక్కయ్యాడు..

|

Nov 13, 2021 | 11:50 AM

Drunk and Drive Case: దేశంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం మత్తులోనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ప్రమాదాలను

Hyderabad Police: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కాడు.. పేరు తప్పు చెప్పి.. మళ్లీ అడ్డంగా బుక్కయ్యాడు..
Drunk And Drive
Follow us on

Drunk and Drive Case: దేశంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం మత్తులోనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేపడుతున్నప్పటికీ.. డ్రింకర్లు మాత్రం వారి నుంచి తప్పించుకునేందుకు.. విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా అలా తప్పించుకోబోయి.. డ్రంక్ డ్రైవ్ కేసుతోపాటు.. మరో కేసులో ఇరుక్కున్నాడు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో చిక్కి కేసు నమోదైన ఓ వ్యక్తి.. తన పేరును తప్పు చెప్పడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పేరును తప్పు చెప్పాడని గుర్తించిన పోలీసులు అతనిపై మరో కేసు నమోదు చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది.

జూబ్లీహిల్స్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈనెల 7న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 36, పిల్లర్‌ నంబరు 1658 వద్ద నారాయణగూడ ట్రాఫిక్‌ ట్రాఫిక్‌ ఎస్సై మల్లయ్య ఆధ్వర్యంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు జరిగాయి. అటుగా వచ్చిన కారును నిలిపి.. పరీక్ష నిర్వహించగా.. 49 ఎంజీగా ఉన్నట్లు గుర్తించారు. అతని వివరాలను సేకరించారు. ఈ క్రమంలో వాహనదారుడు తన పేరును దోమలగూడకు చెందిన నారల లలిత వరప్రసాద్‌గా తెలిపాడు. దీంతో పోలీసులు మోటారు వాహన చట్టం కింద కేసు నమోదు చేసి పంపించారు.

అయితే.. వాహనదారుడి పేరు మీద సమన్లు జారీ చేసే క్రమంలో.. అతని పేరు లలిత వరప్రసాద్‌ కాదని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా అతను మైనర్‌ అని.. వాహనం నడిపేందుకు అనుమతి లేదని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ట్రాఫిక్‌ ఎస్సై మల్లయ్య ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Insurance Crime: రూ.23 కోట్ల బీమా డబ్బు కోసం రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు.. చివరకు సీన్‌ రివర్స్‌..

Cyber Attack: కంపెనీ అకౌంట్‌పై సైబర్‌ ఎటాక్‌.. అరగంటలోనే రూ. 1.28 కోట్లు కొల్లగొట్టారు..