Blu Fab Swimming Pool Incident: హైదరాబాద్ నగరంలోని నాగోల్‌లోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్‌లో మనోజ్ (10) అనే బాలుడు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కాగా స్విమ్మింగ్ పూల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బాబు ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. తమ బాబు చావుకు కారణమైన స్విమ్మింగ్ ఫుల్ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే స్విమ్మింగ్‌పూల్ నిర్వాహకుడు అశోక్ ను చైతన్య పూరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడి మృతదేహానికి నేడు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కాగా ఈ పూల్‌కు అనుమతులు లేవంటూ మనోజ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు తాత్కాలిక అనుమతులు ఉన్నాయంటూ ఓనర్ అశోక్ పోలీసులకు చెబుతున్నారు. దీంతో స్విమ్మింగ్ పూల్ నిర్వహణకు అనుమతులు ఉన్నాయా?లేదా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలో జీహెచ్ఎంసీ అధికారుల సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.
స్విమ్మింగ్‌పూల్‌ను పరిశీలించనున్న జీహెచ్‌ఎంసీ..
కాగా బ్లూ ఫాబ్ స్విమ్మింగ్ పూల్ వ్యవహారం జీహెచ్ఎంసీ జోనల్ డిప్యూటీ కమిషనర్ దృష్టికి వెళ్లింది. నేడు జీహెచ్‌ఎంసీ కమిషనేర్, అసిస్టెంట్ కమిషనర్లు ఈ పూల్‌ను పరిశీలించనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తే సీజ్ చేస్తామని డెప్యూటీ కమిషనర్ హెచ్చరించారు. మరోవైపు స్విమ్మింగ్ ఫుల్ బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ నినాదాలు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
Rashmika Mandanna: స్నేహితురాలి పెళ్లిలో సందడి చేసిన రష్మిక.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..
D Imman: రెండో పెళ్లి చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..