Thirumalagiri Double Murder:హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది. తల్లి కూతురును అతి కిరాతకంగా నరికి చంపాడు ఓ అల్లుడు.. ఈ ఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మిలట్రీ హాస్పిటల్లో పని చేస్తున్న నాగ పుష్పతో అదే ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న చిన్న బాబుతో వివాహం జరిగింది. వీరితో పాటు నాగ పుష్ప తిరుమలగిరి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
కాగా, కుటుంబంలో చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. దీంతో ఆవేశానికి లోనైన చిన్నబాబు.. నాగ పుష్పను, అడ్డుగా వచ్చిన ఆమె తల్లిని కత్తితో నరికి అతి కిరాతకంగా హతమార్చాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తిరుమల గిరి పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని క్లూస్ టీం సహాయంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ హత్యకు సంబంధించి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Also… Singareni Colony: సింగరేణి కాలనీ నిందితుడు రాజు ఆత్మహత్యతో టపాసులు పేల్చి, సంబురాలు జరపుకున్న స్థానిక మహిళలు