జుట్టు రాలిపోతుందంటూ వచ్చి లేడీ డాక్టర్‌పై కన్నేసిన పేషెంట్.. ఏకంగా జీపీఎస్‌తో ట్రాకింగ్..

|

Mar 24, 2021 | 9:30 PM

మాములుగా జీపీఎస్ ను ఎందుకు వినియోగిస్తాం ఒకచోట నుంచి మరోచోటకు వెళ్లేందుకు. కానీ ఇతగాడు మాత్రం డాక్టర్ ను వేధించేందుకు ఉపయోగించుకున్నాడు.

జుట్టు రాలిపోతుందంటూ వచ్చి లేడీ డాక్టర్‌పై కన్నేసిన పేషెంట్.. ఏకంగా జీపీఎస్‌తో ట్రాకింగ్..
Women Cheat
Follow us on

మాములుగా జీపీఎస్‌ను ఒకచోట నుంచి మరోచోటుకి వెళ్లేందుకు వినియోగిస్తారు. లేదంటే పోలీసువారు ఏదైనా క్రైమ్ చేసి పారిపోయిన నిందితులను పట్టుకునేందుకు యూజ్ చేస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఓ పెళ్లైన మహిళా డాక్టర్‌ను వేధించేందుకు ఉపయోగించాడు. లేడీ డాక్టర్‌ను షాడోలా వెంటాడేందుకు.. ఆమె ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు కారుకు సీక్రెట్‌గా జీపీఎస్‌ సిస్టమ్ అమర్చాడు. ఎప్పటికప్పుడు ఆమె ఆచూకీ తెలుసుకుంటూ.. డాక్టర్‌ ఎక్కడికెళ్లినా క్షణాల్లోనే అక్కడ వాలిపోయేవాడు.

విశ్వనాథ్ అనే వ్యక్తి తనకు హెయిల్ ఫాల్ ప్రాబ్లం ఎక్కువగా ఉందని, జుట్టు రాలకుండా చికిత్స చేయాలని కోరుతూ జూబ్లీహిల్స్ కు చెందిన ఓ ఆస్పత్రి వైద్యురాలిని ఆశ్రయించాడు. రోజులు గడుస్తున్నా.. అతడు మాత్రం సమస్య మాత్రం తీరలేదు.  విశ్వనాథ్ ట్రీట్మెంట్ పేరుతో అదే పనిగా ఆస్పత్రికి రావడం.. ‘మీరు చాలా అందంగా ఉన్నారు మేడం’ అంటూ బాధితురాల్ని వేధించడం స్టార్ట్ చేశాడు. రహస్యంగా ఆమె కారుకు జీపీఎస్ ను అమర్చి ఆమె ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. ఈ క్రమంలోనే ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్ లో నాగరాజు అనే  మారుపేరుతో అద్దెకి దిగాడు. మెల్లిగా మహిళా డాక్టర్ కుమారుడికి దగ్గరయ్యాడు. ఆమె కుమారుడిని తన వద్దే వదిలేయాలని.. లేదంటే హతమారుస్తానంటూ బెదిరించాడు. దీంతో వేధింపులు పడలేక వేధింపుల విషయం భర్తకు చెప్పి వాపోయింది.

లేడీ డాక్టర్‌ భర్త శ్రీకాంత్ గౌడ్,… విశ్వనాథ్ ను పద్దతి మార్చుకోమని వార్నింగ్ ఇచ్చేందకు ప్రయత్నించాడు. కానీ ఆ కామాంధుడు రివర్స్ లో ఆమెకు, ఆమె భర్తను వేధించడం మొదలు పెట్టాడు. దాదాపు 4నెలల నుంచి విశ్వనాథ్ వేధింపులు తట్టుకోలేక జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విశ్వనాథ్ ను అతని స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

Also Read:  తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా.. ప్రకటించిన ఉన్నత విద్యామండలి

ఆంధ్రప్రదేశ్‌లో‌ ఒంటి పూట బడులు, వేసవి సెలవులు… పూర్తి షెడ్యూల్ ఇదే…