Telangana: కళ్లజోడు పెట్టుకుని ఎంత అమాయకంగా ఉన్నాడో చూడండి.. మనోడి ట్రాక్ రికార్డ్ తెలిస్తే కంగుతింటారు

TS Crime News: పెళ్లికొచ్చినవారితో అతడు మాటలో మాట కలుపుతాడు. కుటుంబసభ్యుల కంటే ఎక్కువ ప్రేమగా అక్కడికి వచ్చినవారిని పలకరిస్తాడు. టైం చూసుకొని తన ప్లాన్ అప్లై చేస్తాడు.

Telangana: కళ్లజోడు పెట్టుకుని ఎంత అమాయకంగా ఉన్నాడో చూడండి.. మనోడి ట్రాక్ రికార్డ్ తెలిస్తే కంగుతింటారు
Crime News

Updated on: Feb 19, 2022 | 7:51 PM

అందరు పెళ్లి సంబరంలో ఉంటే ఒకే ఒక్కడు మాత్రం ఆ పెళ్లిలో ఉన్న లగేజీపై కన్నేసి తిరుగుతాడు. పెళ్లి పనుల ద్యాసలో ఆ ఇంట్లోని కుటుంబసభ్యులు ఉంటే.. వారి హడావిడిని ఇతడు పెట్టుబడిగా మార్చుకుంటాడు. మాటలో మాట కలుపుతాడు. కుటుంబసభ్యుల కంటే ఎక్కువ ప్రేమగా అక్కడికి వచ్చినవారిని పలకరిస్తాడు. టైం చూసుకొని లగేజీతో చెక్కేస్తాడు. ఇక కొన్ని పెళ్లిళ్లలో క్యాటరింగ్ బాయ్ అవతారం ఎత్తుతాడు. గెస్టులకు కొసరి కొసరి వడ్డిస్తాడు. ఆ వడ్డనకు ఫిదా అవని వారుండరు. అలా పరిచయం పెంచుకొని గంటల వ్యవధిలోనే మండపంలో ఉన్న విలువైన నగలను దోచుకెళ్తాడు. కానీ, పాపం..కేటుగాడి వేషం ఎక్కువకాలం నిలువలేదు. పాపం పండింది..కర్మాన్‌ఘాట్‌ పోలీసుల(Karmanghat police) చేతికి చిక్కాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా(Mahabubnagar District) గొల్లగెరి ఏనుకొండకు చెందిన రవితేజ అలియాస్‌ లడ్డూ అనే దొంగ… ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. చదివింది 10వ తరగతి. జేసీబీ క్లీనర్‌గా పనిచేసేవాడు. ఆ సంపాదన సరిపోక దొంగతనాలకు అలవాటు పడ్డాడు.

ఇతని దొంగతనాల మీద ఫోకస్‌ చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ సాయంతో ట్రేస్‌ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇతని వద్ద నుండి 17 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి మీద మహబూబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో 3 కేసులు, జడ్చర్ల పీఎస్‌లో ఒకటి, శంషాబాద్‌ పీఎస్‌లో ఒకటి, యాదగిరిగుట్ట పీఎస్‌లో మూడు, సరూర్‌ నగర్‌ పీఎస్‌లో మూడు, మీర్పేట్‌ పీఎస్‌లో రెండు, హయత్‌నగర్‌ పీఎస్‌లో ఒక కేసు నమోదయ్యాయి. కుటుంబాలకు పెళ్లి జరిగిన ఆనందం లేకుండా చేస్తున్న దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా అతడిపై గట్టి కేసులు పెట్టాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.

 

 

Also Read: ట్రోలర్స్​కు మోహన్​బాబు లీగల్ నోటీసులు.. రూ.10 కోట్ల దావా!

పేరుకే బ్యూటీషియన్.. ఆమె ఇంట్లోని ఫ్రిజ్‌లో కనిపించింది చూసి పోలీసులు షాక్