Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌ లో గంజాయి విక్రయం.. పక్కా ప్లానింగ్ తో తనిఖీలు చేసిన పోలీసులు.. కట్ చేస్తే

|

Jun 16, 2022 | 6:55 AM

రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతోంది. వీటి పై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుండటంతో అక్రమదారులు వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియానూ....

Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌ లో గంజాయి విక్రయం.. పక్కా ప్లానింగ్ తో తనిఖీలు చేసిన పోలీసులు.. కట్ చేస్తే
Arrest
Follow us on

రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతోంది. వీటి పై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుండటంతో అక్రమదారులు వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియానూ(Social Media) ఓ ప్లాట్ ఫాం గా వినియోగించుకుని గంజాయిని అమ్మేస్తున్నారు. యువత ఎక్కువగా గడిపే ఇన్ స్ట్రా గ్రామ్ ద్వారా ఎర వేసి విక్రయించేస్తున్నారు. తాజాగా హైదరాబాద్(Hyderabad) లో గంజాయి అక్రమంగా అమ్ముతున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌(Adilabad) జిల్లాకు చెందిన ఒమర్‌ఖాన్‌ ఇంటర్ చదివే సమయంలో మధ్యలో ఆపేశాడు. అప్పటి నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి ఆదిలాబాద్‌ అడవుల్లో జశ్వంత్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను గంజాయిని టోకుగా విక్రయించేవాడు. అతని వద్ద ఒమర్ ఖాన్ గాంజాను కొనుగోలు చేసి, హైదరాబాద్ నగరంలో విక్రయిస్తున్నాడు.

ఇందుకోసం సోషల్ మీడియాను వేదికంగా ఎంచుకున్నాడు. యువత ఎక్కువగా ఉపయోగించే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా గాలం వేసి 20 గ్రాముల గంజాయి ప్యాకెట్‌ను రూ.వెయ్యికి విక్రయిస్తున్నాడు. ఈనెల 14న 1,160 గ్రాముల గంజాయిని అమ్మేందుకు నాంపల్లికి వెళ్లాడు. అక్కడే ఓ లాడ్జిలో రూమ్‌ తీసుకుని బస చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జీపై దాడులు చేసి, ఒమర్‌ఖాన్‌ను అరెస్టు చేశారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన సరకు విలువ రూ.2 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..