Hyderabad Crime: ఇల్లు అమ్మిన సొమ్ము ఇవ్వలేదని, తండ్రి, మామను కొట్టి చంపిన యువకుడు
సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది. కాసుల కోసం కన్నవారిపై కసాయిల్లా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ శివారులో దారుణం వెలుగు చూసింది. పట్టపగలు నడి రోడ్డు మీద ఓ యువకుడు రెచ్చిపోయాడు. అందరు చూస్తుండగానే కన్న తండ్రి, మేనమామపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రణాలు కోల్పోయారు.

సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది. కాసుల కోసం కన్నవారిపై కసాయిల్లా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ శివారులో దారుణం వెలుగు చూసింది. పట్టపగలు నడి రోడ్డు మీద ఓ యువకుడు రెచ్చిపోయాడు. అందరు చూస్తుండగానే కన్న తండ్రి, మేనమామపై విచక్షణారహితంగా దాడి చేశాడు. చుట్టూ ఉన్నవారు నిశ్చేష్టులయ్యారే తప్పా, అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్‌దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్ ఈ దారుణం చోటు చేసుకుంది ఇల్లు అమ్మేయడం ఆ తండ్రి చేసిన పాపమైంది. ఇల్లు విక్రయించగా, అగ్రిమెంట్ కాగానే కొన్ని డబ్బులు రావడంతో రాకేష్ తండ్రి లక్ష్మీనారాయణ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇదే విషయంలో కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య వాగ్వాదం నడుస్తున్నట్టుగా స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన రాకేష్ నడిరోడ్డులో తండ్రిని ఇనుప రాడుతో కొట్టి, ముఖంపై రాళ్ళు వేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
తండ్రిని కొట్టొద్దని విడిపించే ప్రయత్నం చేసిన మామ శ్రీనివాసుపై దాడి చేశాడు రాకేష్. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్‌ను స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ కూడా మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న రాకేష్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
