AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త అక్కడ.. భార్య ఇక్కడ.. క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న దంపతుల అరెస్ట్

భర్త గోవా నుంచి క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తుంటే, భార్య హైదరాబాద్‌లో నగదు వసూలు చేసుకుంటుంది. గట్టుచప్పుడు కాకుండా దందా నిర్వహిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్.

భర్త అక్కడ.. భార్య ఇక్కడ.. క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న దంపతుల అరెస్ట్
Balaraju Goud
|

Updated on: Oct 22, 2020 | 8:06 AM

Share

భర్త జీవితంలో భార్య కూడా సగభాగం అన్నట్లు మంచి-చెడుల్లోనూ పాలుపంచుకుంది. భర్త చేసే నేరంలోనూ తానూ ఓ చేయ్యేసింది. భర్త గోవా నుంచి క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తుంటే, భార్య హైదరాబాద్‌లో నగదు వసూలు చేసుకుంటుంది. గట్టుచప్పుడు కాకుండా దందా నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులు సుమన్‌లత, రాహుల్‌ సింగ్‌లను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. బెట్టింగ్‌ నిర్వహిస్తున్న నిందితుల్లో ఇప్పటి వరకు మగవారే ఉండగా.. మహిళ పోలీసులకు చిక్కడం ఇదే తొలిసారి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ్‌హాట్‌ ప్రాంతానికి చెందిన ధరమ్‌సింగ్‌.. నగరంలో బెట్టింగ్‌ నిర్వహిస్తే పోలీసులకు అనుమానం వస్తుందని నెలన్నర కిందట గోవాకు వెళ్లాడు. ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలు ప్రారంభమయ్యాక అక్కడి నుంచి బెట్టింగ్‌ మొదలుపెట్టాడు. తన అల్లుడు రాహుల్‌కు నెలకు రూ.20వేలు జీతం ఇస్తానని, ఫోన్‌ ద్వారా బెట్టింగ్‌ కాసేవారి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించాడు. పదిహేను సెల్‌ఫోన్‌ నంబర్లను రాహుల్‌ ఇవ్వగానే అతడు వారి పేర్లు రాసుకునేవాడు.

ఇటు, హైదరాబాద్ లో బెట్టింగ్‌కాసిన వారి నుంచి ధరమ్‌సింగ్‌ భార్య సుమన్‌లత డబ్బులు వసూలు చేస్తోంది. వారి చిరునామాలు తెలుసుకుని ద్విచక్ర వాహనంపై అక్కడికి వెళ్లి డబ్బు తీసుకువస్తోంది. పక్కా సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. మంగళవారం రాత్రి ధరమ్‌ సింగ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించగా.. బెట్టింగుల వ్యవహారం వెలుగుచూసింది. అలుమగలు ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఒక టీవీ, 15 సెల్ ఫోన్లు, రూ.27వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Follow Us
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం శుభవార్త
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం శుభవార్త
రోజుకు 5 పండ్లు తింటున్నారా? గుండె ఆరోగ్యంపై శాస్త్రవేత్తల సూచన!
రోజుకు 5 పండ్లు తింటున్నారా? గుండె ఆరోగ్యంపై శాస్త్రవేత్తల సూచన!
లైసెన్స్ కావాలంటే ఇలా చేయాల్సిందే! కొత్త గైడ్ లైన్స్..
లైసెన్స్ కావాలంటే ఇలా చేయాల్సిందే! కొత్త గైడ్ లైన్స్..
నీళ్లు తాగడానికి ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేశాడు.. అంతలోనే ఊహించని ఘోరం
నీళ్లు తాగడానికి ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేశాడు.. అంతలోనే ఊహించని ఘోరం
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్
ఖాళీ కడుపుతో ఈ మ్యాజికల్ డ్రింక్ తాగితే..మీ మెదడులో జరిగే అద్భుతం
ఖాళీ కడుపుతో ఈ మ్యాజికల్ డ్రింక్ తాగితే..మీ మెదడులో జరిగే అద్భుతం
ప్రమాదానికి అసలు కారణం? మృతుల పూర్తి వివరాలు ఇవే
ప్రమాదానికి అసలు కారణం? మృతుల పూర్తి వివరాలు ఇవే
Video: క్షణాల్లో బరువు తగ్గించే పవర్ ఫుల్ 'సీక్రెట్ టిప్' ఇదిగో
Video: క్షణాల్లో బరువు తగ్గించే పవర్ ఫుల్ 'సీక్రెట్ టిప్' ఇదిగో
ఉదయాన్నే పరగడుపున మామిడి పండ్లు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.
ఉదయాన్నే పరగడుపున మామిడి పండ్లు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు