AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amrabad Tigers: అమ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు.. అడ పులులదే రాజ్యం.. 90 రోజుల పాటు అటవీ ప్రాంతం మూసివేత

Amrabad Tigers: అక్కడ రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు.. ఆడ పులులదే రాజ్యం. అమ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులులను గుర్తించారు అటవీ శాఖ అధికారులు. కానీ 90 రోజుల పాటు అటవీ ప్రాంతాన్ని మూసివేయనున్నారు. గత నవంబర్‌ 2025 నుంచి జూన్‌..

Amrabad Tigers: అమ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు.. అడ పులులదే రాజ్యం.. 90 రోజుల పాటు అటవీ ప్రాంతం మూసివేత
Amrabad Tigers
Vijay Saatha
| Edited By: |

Updated on: Jun 28, 2026 | 8:48 AM

Share

Amrabad Tigers: అమ్రాబాద్ టైగర్‌ రిజర్వ్‌ మరోసారి తన సత్తా చాటింది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అఖిల భారత పులుల అంచనా (AITE-2026) ప్రాథమిక సర్వేలో అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో మొత్తం 42 పులుల ఆనవాళ్లు నమోదయ్యాయి. వీటిలో 18 ఆడ పులులు, 14 మగ పులులు, 2 సబ్‌ అడల్ట్‌ పులులు, 8 పులి పిల్లలు (కబ్స్‌) ఉన్నట్లు ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైంది. దీంతో తెలంగాణలో పులుల సంరక్షణ చర్యలు ఫలిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గత నవంబర్‌ 2025 నుంచి జూన్‌ 2026 వరకు దశలవారీగా సర్వే నిర్వహించారు. రిజర్వ్‌ ప్రాంతాన్ని 11×11 కిలోమీటర్ల గ్రిడ్‌లుగా విభజించి, ప్రతి గ్రిడ్‌లో కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం 2 వేలకుపైగా కెమెరా ట్రాప్‌లు అమర్చి పులుల కదలికలను రికార్డు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. సేకరించిన ఫొటోలు, వీడియోలు, పాదముద్రలు, ఇతర శాస్త్రీయ ఆధారాల ఆధారంగా ఈ ప్రాథమిక గణాంకాలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. పులులతో పాటు ఇతర వన్యప్రాణుల సంచారాన్ని కూడా ఈ సర్వేలో నమోదు చేశారు. సుదూర అటవీ ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణ, డేటా సేకరణ వంటి ప్రక్రియల్లో అటవీ సిబ్బంది, నిపుణులు కీలక పాత్ర పోషించారు. ఈ సర్వే తుది నివేదిక వెలువడిన తర్వాత అమ్రాబాద్‌లో పులుల సంఖ్యపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

పులుల సంరక్షణకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు జూలై 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు అమ్రాబాద్ టైగర్‌ రిజర్వ్‌ను పర్యాటకులకు మూసివేయనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. వర్షాకాలంలో అటవీ పునరుత్పత్తి, వన్యప్రాణుల సంరక్షణ, పులుల సంచారానికి అనుకూల వాతావరణం కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని అటవీశాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: Gold Rates: బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి..? నగలు కొనేటప్పుడు ఈ విషయాలు మర్చిపోవద్దు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రేయస్ అయ్యర్‌ మీద వైభవ్‎కు అంత కోపముందా ?
శ్రేయస్ అయ్యర్‌ మీద వైభవ్‎కు అంత కోపముందా ?
టీ vs కాఫీ.. ఇదో పెద్ద మైండ్ గేమ్.. మీ ఛాయిస్‌ను బట్టి మీరు ఎలాంట
టీ vs కాఫీ.. ఇదో పెద్ద మైండ్ గేమ్.. మీ ఛాయిస్‌ను బట్టి మీరు ఎలాంట
అమ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు..అడ పులులదే రాజ్యం
అమ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు..అడ పులులదే రాజ్యం
నువ్వు లేకపోతే చచ్చిపోతా అని.. తర్వాత టార్చర్ చేశాడు..
నువ్వు లేకపోతే చచ్చిపోతా అని.. తర్వాత టార్చర్ చేశాడు..
బలవంతులమని విర్రవీగితే మనకంటే సమర్థులు ఎదురుపడతారు.. తెలివిగా ఇలా
బలవంతులమని విర్రవీగితే మనకంటే సమర్థులు ఎదురుపడతారు.. తెలివిగా ఇలా
టికెట్ ఉన్నా ఈ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టలేరు.. ఎందుకంటే?
టికెట్ ఉన్నా ఈ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టలేరు.. ఎందుకంటే?
జుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ రూ.199కే..వ్యాలిడిటీ ఎంతంటే
జుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ రూ.199కే..వ్యాలిడిటీ ఎంతంటే
మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు
మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు
అమ్మాయిలను రూమ్‌కి రప్పించి.. ఆ తర్వాత వేరే కథ
అమ్మాయిలను రూమ్‌కి రప్పించి.. ఆ తర్వాత వేరే కథ
తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..
తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..