రెగ్యులర్ గా జీడిపప్పు తింటే బరువు పెరుగుతారా లేక తగ్గుతారా?

28 June 2026

Jyothi Gadda

డ్రై ఫ్రూట్స్‌ లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైన నట్స్ లో ఒకటి. స్వీట్ల నుండి ఘాటైన మసాలా వంటల వరకు.. దేనిలోనైనా జీడిపప్పును జోడిస్తే ఆ వంటకానికి అదనపు రుచి వస్తుంది. 

ఆహార నిపుణుల స్పష్టత ప్రకారం, జీడిపప్పును తీసుకునే పరిమాణం, తినే విధానాన్ని బట్టి అది శరీరంపై ప్రభావం చూపిస్తుంది. జీడిపప్పులో కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.

ఒకవేళ మీరు బరువు పెరగాలని అనుకుంటే, జీడిపప్పును నేరుగా కాకుండా కాస్త నెయ్యి లేదా నూనెలో వేయించి, ఉప్పు జోడించి తినాలి. ఇలా తినడం వల్ల ఆకలి, దాహం పెరుగుతాయి. కేలరీలు ఎక్కువగా లభిస్తాయి.

బరువు తగ్గాలని డైట్ ఫాలో అయ్యేవారు కూడా జీడిపప్పును తినవచ్చు. అయితే వీరు చాలా పరిమిత మోతాదులో (రోజుకు 4-5 నట్స్) మాత్రమే తీసుకోవాలి. ఇది మంచి ఈవెనింగ్ స్నాక్ లా పనిచేస్తుంది.

జీడిపప్పులో ఉండే మోనో-అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను (HDL) పెంచుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తుంది. ఇందులోని కాల్షియం, మెగ్నీషియం ఎముకలను దృఢంగా, చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

జీడిపప్పు శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే పవర్‌హౌస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, అతిగా తింటే మాత్రం బరువు పెరగడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి, పరిమితంగా తీసుకోవాలి.

సాధారణంగా రోజుకు 5 నుంచి 10 జీడిపప్పులు తినడమే సరిపోతుంది. కొవ్వులు ప్రోటీన్ ఎక్కువ అవసరమైన వాళ్ళు 15 నుంచి 30 వరకు కూడా తీసుకోవచ్చు.