హైదరాబాద్ నడిబొడ్డున డెడ్‌బాడీ కలకలం.. ఓవర్ ‌హెడ్ వాటర్ ట్యాంక్‌లో మృతదేహం.. ఆందోళనలో స్థానికులు !

|

Dec 07, 2021 | 8:05 PM

హైదరాబాద్ మహానగరం నడిబోడ్డున మంచినీటి ట్యాంకులో మృతదేహం కలకలం రేపుతోంది. ముషీరాబాద్ హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

హైదరాబాద్ నడిబొడ్డున డెడ్‌బాడీ కలకలం.. ఓవర్ ‌హెడ్ వాటర్ ట్యాంక్‌లో మృతదేహం.. ఆందోళనలో స్థానికులు !
Dead Body
Follow us on

Hyderabad dead body in Water Tank: హైదరాబాద్ మహానగరం నడిబోడ్డున మంచినీటి ట్యాంకులో మృతదేహం కలకలం రేపుతోంది. ముషీరాబాద్ హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేయడానికి వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బందికి మృతదేహం కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే సిబ్బంది.. వాటర్ వర్క్స్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంచి నీటి ట్యాంకులో డెడ్‌బాడీ లభించడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

ముషీరాబాద్ పోలీస్ క్లూస్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని సాక్ష్యులను సేకరించారు. ట్యాంక్‌పై చెప్పులు ఉండడంతో అవి మృతునికి సంబంధించినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతునికి సంబంధించిన ఆనవాళ్లు చెప్పులను బట్టి మృతుని వయసు 35 నుండి 40 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఎన్టీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ విషయం తెలియడంతో ఘటన స్థలం వద్దకు పెద్ద ఎత్తున్న స్థానికులు చేరుకున్నారు. ఎవరన్నా హత్యా చేసి వాటర్ ట్యాంక్ లో వ్యక్తి నీ పడేసి ఉంటారా? లేక మద్యం మత్తులో లేక వ్యక్తి ప్రమాద వశాత్తూ వాటర్ ట్యాంక్ లో పడ్డాడా… అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదిలావుంటే, హెడ్ వాటర్ ట్యాంక్ నుండి హరినగర్, రిసాల, శివస్థాన్‌పూర్ ఎస్.ఆర్.కె నగర్ ప్రాంతాలకు రోజు విడిచి రోజు దాదాపు లక్ష గ్యాలన్ల లీటర్ల మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఇదిలావుండగా, ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద వాటర్ ట్యాంక్ కు సంబంధించిన సిబ్బంది ఎవరూ రక్షణ లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. వాటర్ ట్యాంకులో వ్యక్తి చనిపోయి  సుమారు నాలుగు రోజులు అయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, మృతదేహన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also…  Telangana News: గల్లీకి చేరిన ఢిల్లీ రాజకీయాలు.. వరి ధాన్యం కోనుగోలుపై ఆగని మాటల యుద్ధం..